Kamal Haasan: కమల్‌ హాసన్‌తో ఉన్న ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టారా? డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గానూ ఫేమస్‌

పై ఫొటోలో లోక నాయకుడు కమల్ హాసన్‌తో ఉన్నది ఎవరో గుర్తుపట్టారా? మీరు మూవీ లవర్‌ అయితే ఈజీగా గుర్తుపట్టేయచ్చు. ఎందుకంటే ఈమె తెలుగులో నటించింది చాలా తక్కువ సినిమాలే. అయితేనేం.. తనదైన అందం, నటనతో చాలామందికి గుర్తుండిపోతుంది

Kamal Haasan: కమల్‌ హాసన్‌తో ఉన్న ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టారా? డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గానూ ఫేమస్‌
Kamal Haasan
Follow us
Basha Shek

|

Updated on: Jul 30, 2023 | 8:48 PM

పై ఫొటోలో లోక నాయకుడు కమల్ హాసన్‌తో ఉన్నది ఎవరో గుర్తుపట్టారా? మీరు మూవీ లవర్‌ అయితే ఈజీగా గుర్తుపట్టేయచ్చు. ఎందుకంటే ఈమె తెలుగులో నటించింది చాలా తక్కువ సినిమాలే. అయితేనేం.. తనదైన అందం, నటనతో చాలామందికి గుర్తుండిపోతుంది. ఛైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె తెలుగుతో పాటు తమిళ్‌, కన్నడ, మలయాళ భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆపై మలయాళ భాషల్లోని పలు ఛానల్స్‌లో పని చేసింది. ఆ తర్వాత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులోనూ ఈమె నటించిన ఒక ప్రేమకథా చిత్రం బాగా ఫేమస్‌. అందులో తన నటనతో కంటతడి పెట్టించేసింది. అదే సమయంలో స్టార్‌ కమెడియన్‌ను సునీల్‌ను ఓ ఆట ఆడేసుకుంది. చాలామందికి ఈపాటికే అర్థమై ఉంటుంది. ఆమె ఎవరో? కనిపెట్టలేకపోయినా నో ప్రాబ్లమ్‌ సమాధానం కూడా మేమే చెబుతాం లెండి.  కమల్ తో ఉన్నది మరెవరో కాదు వేణు నటించిన ‘చెప్పవే చిరుగాలి’ సినిమా హీరోయిన్‌ అభిరామి.

వేణు నటించిన చెప్పవే చిరుగాలితో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది అభిరామి. అంతకుముందు ఆమె నటించిన థ్యాంక్యూ సుబ్బారావ్‌, చార్మినార్‌ వంటి సినిమాలు పెద్దగా క్లిక్‌ కాకపోవడంతో అభిరామి గురించి పెద్దగా తెలియరాలేదు. అయితే చెప్పవే చిరుగాలి సినిమాతో మాత్రం అందరినీ ఆకట్టుకుంది. తెలుగులో మూడే సినిమాలు చేసిన అభిరామి తమిళ్‌, కన్నడ, మలయాళ భాషల్లో మాత్రం పలు హిట్‌ సినిమాల్లో నటించింది. అలాగే డబ్బింగ్‌ ఆర్టిస్‌గానూ మంచి పేరు తెచ్చుకుంది. పెళ్లి తర్వాత కాస్త గ్యాప్ తీసుకుంది. కాగా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అభిరామి కొద్ది రోజుల క్రితం ఓ ఫొటోను షేర్‌ చేసింది. కమల్‌తో ఉన్న ఫొటోను షేర్‌ చేస్తూ ‘ కమల్‌ సార్‌తో ఇది నా ఫస్ట్‌ ఫొటో.. మర్చిపోలేని జ్ఞాపకం’ అని త్రో బ్యాక్‌ ఫొటోను షేర్‌చేసింది. ఈ ఫొటో షేర్‌ చేసిన కొద్ది రోజులకే పోతురాజు సినిమాలో కమల్ పక్కన హీరోయిన్‌గా అభిరామి నటించడం విశేషం.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by zeetamil (@zeetamizh)

View this post on Instagram

A post shared by zeetamil (@zeetamizh)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?