Baby OTT: ‘బేబీ’ ఓటీటీ రిలీజ్‌పై నిర్మాతల షాకింగ్‌ నిర్ణయం.. స్ట్రీమింగ్‌కు వచ్చేది అప్పుడేనట!

చిన్న సినిమాగా వచ్చి సంచలనం సృష్టించింది 'బేబీ'. యంగ్‌ హీరో ఆనంద్‌ దేవరకొండ, యూట్యూబ్‌ సెన్సేషన్‌ వైష్ణవి చైతన్య, విరాజ్‌ అశ్విన్‌ కీలక పాత్రల్లో నటించిన ఈ ట్రైయాంగిల్‌ లవ్‌ స్టోరీ బాక్సాఫీస్‌ దుమ్ము దులిపేస్తోంది. జులై 14న విడుదలైన బేబీ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఇప్పటికే పలు రికార్డులు కొల్లగొట్టింది.

Baby OTT: 'బేబీ' ఓటీటీ రిలీజ్‌పై నిర్మాతల షాకింగ్‌ నిర్ణయం.. స్ట్రీమింగ్‌కు వచ్చేది అప్పుడేనట!
Baby Movie
Follow us
Basha Shek

|

Updated on: Jul 30, 2023 | 8:10 PM

చిన్న సినిమాగా వచ్చి సంచలనం సృష్టించింది ‘బేబీ’. యంగ్‌ హీరో ఆనంద్‌ దేవరకొండ, యూట్యూబ్‌ సెన్సేషన్‌ వైష్ణవి చైతన్య, విరాజ్‌ అశ్విన్‌ కీలక పాత్రల్లో నటించిన ఈ ట్రైయాంగిల్‌ లవ్‌ స్టోరీ బాక్సాఫీస్‌ దుమ్ము దులిపేస్తోంది. జులై 14న విడుదలైన బేబీ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఇప్పటికే పలు రికార్డులు కొల్లగొట్టింది. విజయ్‌ దేవరకొండ అర్జున్‌ రెడ్డి లాంటి సూపర్‌ హిట్‌ సినిమా ఓవరాల్‌ కలెక్షన్లను కూడా బేబీ దాటేసిందంటే ఈ మూవీ ఎంతలా ఆకట్టుకుంటుందో ఇట్టే చెప్పవచ్చు. విడుదలైన రెండు వారాల్లో సుమారు రూ. 70 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన బేబీ ఇప్పుడు మూడో వారంలోకి ప్రవేశించింది. పవన్‌ కల్యాణ్‌ బ్రో రిలీజైనా బేబీ వసూళ్లు మాత్రం నిలకడగానే ఉన్నాయి. 16వ రోజు కూడా కోటికి పైగా వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు బేబీ ఓటీటీ రిలీజ్‌పై ఎన్నో రకాల వార్తలు పుట్టుకొస్తున్నాయి. బేబీ మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా సొంతం చేసుకుంది. ఈ క్రమంలో థియేటర్లలో విడుదలైన 30 రోజుల తర్వాత అంటే ఆగస్టు చివరి వారంలో (ఆగస్టు18) ఈ సూపర్‌ హిట్‌ మూవీ స్ట్రీమింగ్‌కు వస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఆగస్టు 15న కూడా ఓటీటీలోకి రావొచ్చని రూమర్లు వినిపిస్తున్నాయి.

ఈక్రమంలో బేబీ మూవీ ఓటీటీ రిలీజ్‌పై నిర్మాతలు ఒక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోన్న తమ సినిమాను ఇప్పుడే ఓటీటీలో రిలీజ్‌ చేసే విషయంపై ఆలోచించడం లేదంటున్నారే మేకర్స్‌. ‘బేబీ డిజిటల్‌ స్ట్రీమింగ్ గురించి మేం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆగస్టు 18న స్ట్రీమింగ్ అవుతుంది అన్న వార్తల్లో నిజం లేదు’ అని నిర్మాత ఎస్‌కేఎన్‌ క్లారిటీ ఇచ్చారట. సో.. బేబీ ఇప్పుడిప్పుడే ఓటీటీలో రిలీజయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. సో ఈ యూత్‌ఫుల్‌ లవ్‌ స్టోరీని చూడాలంటే థియేటర్లకు వెళ్లాల్సిందే మరి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?