AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manchu Manoj: నీ చేయి పట్టుకుని నడుస్తున్నందుకు గర్వంగా ఉంది.. హ్యాపీ బర్త్‌ డే ధైరవ్‌: మంచు మనోజ్‌ ఎమోషనల్

ప్రముఖ టాలీవుడ్ నటుడు మంచు మనోజ్‌ కొన్ని నెలల క్రితం రెండోసారి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. కర్నూలుకు చెందిన దివంగత రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డిల కుమార్తె భూమా మౌనికారెడ్డితో కలిసి ఏడడుగులు వేశాడు. కాగా మనోజ్‌, మౌనికలిద్దరికీ ఇది రెండో వివాహం. మౌనికకు ధైరవ్‌ అనే కుమారుడు కూడా ఉన్నాడు. అయితే మౌనికను పెళ్లి చేసుకున్న సమయంలోనే ధైరవ్‌ బాధ్యతలు కూడా తనవేనని చెప్పుకొచ్చాడు మనోజ్‌...

Manchu Manoj: నీ చేయి పట్టుకుని నడుస్తున్నందుకు గర్వంగా ఉంది.. హ్యాపీ బర్త్‌ డే ధైరవ్‌: మంచు మనోజ్‌ ఎమోషనల్
Manchu Manoj, Mounika
Basha Shek
|

Updated on: Aug 01, 2023 | 6:27 PM

Share

ప్రముఖ టాలీవుడ్ నటుడు మంచు మనోజ్‌ కొన్ని నెలల క్రితం రెండోసారి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. కర్నూలుకు చెందిన దివంగత రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డిల కుమార్తె భూమా మౌనికారెడ్డితో కలిసి ఏడడుగులు వేశాడు. కాగా మనోజ్‌, మౌనికలిద్దరికీ ఇది రెండో వివాహం. మౌనికకు ధైరవ్‌ అనే కుమారుడు కూడా ఉన్నాడు. అయితే మౌనికను పెళ్లి చేసుకున్న సమయంలోనే ధైరవ్‌ బాధ్యతలు కూడా తనవేనని చెప్పుకొచ్చాడు మనోజ్‌. ‘కలిసొచ్చే కాలానికి.. ఎదిగొచ్చే కుమారుడు’ అంటూ అప్పట్లో మనోజ్ ధైరవ్‌ గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు. కాగా మంగళవారం (ఆగస్టు1) మౌనిక కుమారుడు ధైరవ్‌ నాగిరెడ్డి బర్త్‌డే. దీంతో తన కుమారుడి పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేశాడు మంచువారబ్బాయి. అనంతరం ఈ ఫొటోలను సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసి ఎమోషనల్‌ అయ్యాడు. ప్రస్తుతం మనోజ్‌ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మనోజ్ ఫ్యాన్స్‌ సైతం ధైరవ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ‘ఈ పవిత్రమైన రోజున నాకు అమూల్యమైన నిధిని బహుమతిగా ఇచ్చినందుకు నేను శివునికి కృతజ్ఞతలు తెలుపుతున్నా. నువ్వు నా ధైర్యం ధైరవ్. నా ప్రపంచంలోకి మీరిద్దరు రావడం కేవలం ఒక సంఘటన కాదు. నన్ను ఓ మంచి మనిషిగా మారడానిని మీరే నాంది పలికారు. నీ నవ్వు, నీ అమాయక కళ్లు నాకు మార్గదర్శకాలు. నీ ఉనికి, అమ్మ మౌనిక ప్రేమ నాకు జీవితాన్ని చాలా భిన్నమైన మార్గంలో అర్థం చేసుకునేలా చేశాయి’ అని తన ఆనందానికి అక్షర రూపమిచ్చాడు మనోజ్‌.

‘నీ బోసి నవ్వులు, కౌగిలింతల వెచ్చదనం లేని జీవితాన్ని ఊహించలేను. నీ ప్రజెన్స్‌ నా జీవితంలో వెలుగులు నింపింది. నా మనసును అపరిమితమైన సంతోషంతో నింపింది. నా ప్రియమైన ధైరవ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. నీ జర్నీ ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. అడుగడుగునా నీ చేయి పట్టుకుని వెంట నడుస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. నువ్వు జీవితంలో ఉన్నత స్థానాలు అధిరోహించాలని మనసారా కోరుకుంటున్నా’ అని రాసుకొచ్చాడు మనోజ్‌. కాగా నిన్న (మంగళవారం) మనోజ్‌, మౌనిక దంపతులు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని కలిసిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు ఆశీస్సులు తీసుకునేందుకే వచ్చామని, ఇందులో రాజకీయాలకు సంబంధం లేదని తమ భేటీపై క్లారిటీ ఇచ్చారు మనోజ్‌, మౌనిక.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.

కళ్లు పొడిబారుతున్నాయా.. చూపు పోయే ప్రమాదం ఉంది జాగ్రత్త!
కళ్లు పొడిబారుతున్నాయా.. చూపు పోయే ప్రమాదం ఉంది జాగ్రత్త!
మనసుల్లో రారాజు.. ఇమ్మూ జర్నీ వీడియో గూస్ బంప్స్..
మనసుల్లో రారాజు.. ఇమ్మూ జర్నీ వీడియో గూస్ బంప్స్..
ఆర్మీ కొలువులకు 40% మార్కులతోనే ఎంపిక.. సెలక్షన్‌ ఎలా ఉంటుందంటే?
ఆర్మీ కొలువులకు 40% మార్కులతోనే ఎంపిక.. సెలక్షన్‌ ఎలా ఉంటుందంటే?
Jailer2: రజనీ మాస్ ఎంటర్‌టైనర్‌లో ఆ బ్యూటీకి స్పెషల్ సాంగ్ ఛాన్స్
Jailer2: రజనీ మాస్ ఎంటర్‌టైనర్‌లో ఆ బ్యూటీకి స్పెషల్ సాంగ్ ఛాన్స్
రష్మిక సీక్రెట్ పార్టీలో.. ఆ 'మిస్టరీ బ్యూటీ'! ఎవరు?
రష్మిక సీక్రెట్ పార్టీలో.. ఆ 'మిస్టరీ బ్యూటీ'! ఎవరు?
ఏపీలో విజృంభిస్తున్న స్క్రబ్ టైఫస్.. 15కు చేరిన మృతుల సంఖ్య!
ఏపీలో విజృంభిస్తున్న స్క్రబ్ టైఫస్.. 15కు చేరిన మృతుల సంఖ్య!
100 కోట్లు టు 1000 కోట్లు.. రికార్డులను తిరగరాస్తున్న టాలీవుడ్
100 కోట్లు టు 1000 కోట్లు.. రికార్డులను తిరగరాస్తున్న టాలీవుడ్
20 సిక్సర్లు, 24 ఫోర్లతో డబుల్ సెంచరీ.. దుమ్మురేపిన బుడ్డోడు
20 సిక్సర్లు, 24 ఫోర్లతో డబుల్ సెంచరీ.. దుమ్మురేపిన బుడ్డోడు
తన సామాజిక వర్గంపై తొలిసారి నోరు విప్పిన నటి.. నెట్టింట చర్చ!
తన సామాజిక వర్గంపై తొలిసారి నోరు విప్పిన నటి.. నెట్టింట చర్చ!
23 ఏళ్లుగా ఇండస్ట్రీలో తోపు.. చేసింది 7 సినిమాలే..
23 ఏళ్లుగా ఇండస్ట్రీలో తోపు.. చేసింది 7 సినిమాలే..