AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sai Dharam Tej: ఈ ఫొటోలో సాయి ధరమ్ తేజ్‌తో ఉన్నదెవరో గుర్తుపట్టారా? సీనియర్‌ నటుడి కుమారుడు, ఒకప్పటి యంగ్‌ హీరో

సుప్రీం హీరో, మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ ప్రస్తుతం ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు. మేనమామ పవన్‌ కల్యాణ్‌తో అతను నటించిన బ్రో సూపర్‌హిట్‌గా నిలిచింది. జులై 28న విడుదలైన ఈ మెగా మల్టీ స్టారర్‌ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. అయితే సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు విరివిగా ప్రమోషన్లు చేస్తున్నాడు తేజ్‌. వరుసగా ఇంటర్వ్యూలు, ప్రమోషన్‌ ఈవెంట్లలో పాల్గొంటున్నాడు. ఇదే సమయంలో స్నేహితులతో కలిసి సరదాగా చిల్‌ అవుతున్నాడు.

Sai Dharam Tej: ఈ ఫొటోలో సాయి ధరమ్ తేజ్‌తో ఉన్నదెవరో గుర్తుపట్టారా? సీనియర్‌ నటుడి కుమారుడు, ఒకప్పటి యంగ్‌ హీరో
Sai Dharam Tej
Basha Shek
|

Updated on: Aug 01, 2023 | 4:37 PM

Share

సుప్రీం హీరో, మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ ప్రస్తుతం ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు. మేనమామ పవన్‌ కల్యాణ్‌తో అతను నటించిన బ్రో సూపర్‌హిట్‌గా నిలిచింది. జులై 28న విడుదలైన ఈ మెగా మల్టీ స్టారర్‌ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. అయితే సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు విరివిగా ప్రమోషన్లు చేస్తున్నాడు తేజ్‌. వరుసగా ఇంటర్వ్యూలు, ప్రమోషన్‌ ఈవెంట్లలో పాల్గొంటున్నాడు. ఇదే సమయంలో స్నేహితులతో కలిసి సరదాగా చిల్‌ అవుతున్నాడు. అలా తన ఫ్రెండ్స్‌తో దిగిన ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. అందులో సాయి ధరమ్ తేజ్ తో బ్లాక్‌ సర్కిల్‌లో ఉన్నదెవరో గుర్తుపట్టారా? అతను ఒక సీనియర్‌ నటుడి కుమారుడు, ఒకప్పటి యంగ్ హీరో. గతంలో పలు సినిమాల్లో నటించిన అతను ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. అతని లుక్‌ చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ అతనెవరో తెలుసా? ప్రముఖ సీనియర్‌ నటుడు వీకే నరేష్‌ కుమారుడు, ఒకప్పటి హీరో వినయ్‌ విజయ్‌ కృష్ణ. గతంలో ‘నందిని నర్సింగ్ హోమ్’, ‘ఊరంతా అనుకుంటున్నారు’, ‘ఐనా ఇష్టం నువ్వు’ సినిమాల్లో హీరోగా నటించాడు విజయ్‌కృష్ణ. అయితే ఈ సినిమాలు పెద్దగా సక్సెస్‌ కాలేదు. దీంతో నటనను పక్కన పెట్టేశాడు. అయితే సినిమాలపై మక్కువ మాత్రం వదులుకోలేదు. అయితే టెక్నీషియన్‌గా మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. ఎడిటింగ్‌తో పాటు 24 క్రాఫ్ట్స్‌ లోని పలు విభాగాల మీద నవీన్‌కు చాలా అనుభవం ఉంది.’అత్తారింటికి దారేది’ సినిమా ట్రైలర్‌ను కూడా నవీనే కట్‌ చేశాడని ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు త్రివిక్రమ్‌.

కాగా సాయి ధరమ్ తేజ్‌- నవీన్‌ ఇద్దరూ బెస్ట్‌ ఫ్రెండ్స్‌. తరచూ కలుస్తుంటారు. తేజ్‌కి రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు కూడా నవీన్‌ ఇంటి నుంచే స్టార్ట్‌అయ్యాడు. కాగా ఇప్పటికే యాక్టర్‌గా, టెక్నీషియన్‌గా తనను తాను ప్రూవ్‌ చేసుకున్న నవీన్‌ ఇప్పుడు డైరెక్టర్‌గా మారనున్నాడు. అయితే మొదట సినిమా కాకుండా ఓ షార్ట్‌ ఫిల్మ్‌తో మన ముందుకు రానున్నాడు. సాయి ధరమ్‌ తేజ్‌, స్వాతి కలర్స్‌ హీరో హీరోయిన్లుగా సత్య అనే షార్ట్‌ ఫిల్మ్‌ను తెరకెక్కించాడు నవీన్‌. ఆర్మీ జవాన్‌ లవ్‌స్టోరీ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ త్వరలోనే రిలీజ్‌ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా సాయి ధరమ్‌ తేజ్‌తో నవీన్‌ కలిసిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇందులో అతను చాలా లావుగా కనిపించడంతో సినీ ఫ్యాన్స్‌ షాక్‌ అవుతున్నారు. కాగా బ్రో తర్వాత సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు తేజ్‌. దీనికి గాంజా శంకర్‌ అనే టైటిల్‌ కూడా ఫిక్స్‌ చేసినట్లు సమాచారం.

Sai Dharam Tej, Naveen

Sai Dharam Tej, Naveen

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం  క్లిక్ చేయండి..