Pawan Kalyan: పవర్‌స్టార్‌కి అసలైన బ్లాక్‌బస్టర్ పడేదెప్పుడు.? ఫ్యాన్స్ వెయిటింగ్..

2013లో అత్తారింటికి దారేది వచ్చింది.. ఆ తర్వాత గోపాలా గోపాలా, సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు, అజ్ఞాతవాసి సినిమాలు చేసారు పవన్. ఇందులో కేవలం గోపాలా గోపాలా మాత్రమే యావరేజ్.. మిగిలివన్నీ ఫ్లాపులే. ఇక వకీల్ సాబ్‌తో రీ ఎంట్రీ ఇచ్చాక కూడా పరిస్థితి మారలేదు. పింక్ రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రం కరోనా తాడికి తట్టుకుని.. పవన్ స్టామినాతోనే 90 కోట్లు వసూలు చేసింది. భీమ్లా నాయక్ పరిస్థితీ అంతే.. అది కూడా రీమేకే. యావరేజ్ టాక్‌తోనే దీన్ని కూడా 95 కోట్ల వరకు లాక్కొచ్చారు పవర్ స్టార్.

Pawan Kalyan: పవర్‌స్టార్‌కి అసలైన బ్లాక్‌బస్టర్ పడేదెప్పుడు.? ఫ్యాన్స్ వెయిటింగ్..
Bro Movie
Follow us
Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Ravi Kiran

Updated on: Aug 01, 2023 | 5:51 PM

పవన్ సినిమాలు మూడు రోజుల ముచ్చటగా మిగిలిపోతున్నాయా..? పవర్ స్టార్‌కు కనీసం పాతిక రోజుల సినిమా పడట్లేదా..? వచ్చిన సినిమాలన్నీ ఫస్ట్ వీకెండ్ తర్వాత చల్లబడుతున్నాయా..? ఎందుకంటే పవన్ సినిమాకు లాంగ్ రన్ ఉంటే ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చరిత్ర చెప్తుంది. కానీ ఏం చేస్తాం పదేళ్లుగా ఆ కోరిక తీరట్లేదు. మరి పవర్ స్టార్‌కి అసలు సినిమా పడేదెప్పుడు..?

గబ్బర్ సింగ్ వచ్చి పదేళ్లు దాటిపోయింది.. అయినా ఇంకా అలాంటి ఒక్క సినిమా పడితే చూడాలని ఆశతో ఉన్నారు పవన్ అభిమానులు. అంటే ఆ తర్వాత ఆ రేంజ్ సినిమా రాలేదనేగా అర్థం. పైగా మధ్యలో అత్తారింటికి దారేది లాంటి ఫ్యామిలీ మూవీతోనూ ఇండస్ట్రీ హిట్ కొట్టారు పవన్. కంటెంట్ బలంగా ఉన్న ప్రతీసారీ పవన్ ఊచకోత మామూలుగా లేదు.. కానీ రీమేక్స్, రొటీన్ కథలు పడితే మాత్రం ఆ ఇంపాక్ట్ కనిపించట్లేదు.

2013లో అత్తారింటికి దారేది వచ్చింది.. ఆ తర్వాత గోపాలా గోపాలా, సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు, అజ్ఞాతవాసి సినిమాలు చేసారు పవన్. ఇందులో కేవలం గోపాలా గోపాలా మాత్రమే యావరేజ్.. మిగిలివన్నీ ఫ్లాపులే. ఇక వకీల్ సాబ్‌తో రీ ఎంట్రీ ఇచ్చాక కూడా పరిస్థితి మారలేదు. పింక్ రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రం కరోనా తాడికి తట్టుకుని.. పవన్ స్టామినాతోనే 90 కోట్లు వసూలు చేసింది.

భీమ్లా నాయక్ పరిస్థితీ అంతే.. అది కూడా రీమేకే. యావరేజ్ టాక్‌తోనే దీన్ని కూడా 95 కోట్ల వరకు లాక్కొచ్చారు పవర్ స్టార్. పైగా అప్పుడు ఏపీలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంది ఈ చిత్రం. అన్ని చేసినా.. పవన్ ఇమేజ్‌తోనే భీమ్లా నాయక్ దాదాపు 100 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇప్పుడు బ్రో కూడా 3 రోజుల్లోనే 55 కోట్లకు పైగా షేర్ తీసుకొచ్చింది.. కానీ ఇది హిట్ అవ్వాలంటే మరో 44 కోట్లు రావాల్సిందే.

ఆల్రెడీ ఓటిటిలో వచ్చిన సినిమాను పవన్ ఇమేజ్‌కు తగ్గట్లు మార్చి బ్రో తెరకెక్కించారు సముద్రఖని. అరకొర స్టోరీస్, రీమేక్స్‌తోనే అదిరిపోయే ఓపెనింగ్స్ తెస్తున్న పవన్‌కు సరైన సినిమా పడితే రేంజ్ మామూలుగా ఉండదనేది ట్రేడ్ అంచనా. మూడ్రోజుల ముచ్చట బానే ఉన్నా.. కనీసం 25 రోజులు ఆడితే ఇండస్ట్రీ హిట్ కొట్టే సత్తా పవన్‌కు ఉంది. అలాంటి సినిమా కోసమే చూస్తున్నారు ఫ్యాన్స్ కూడా.

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా