Ambati Rambabu: ‘బ్రో’ సినిమాకు కలెక్షన్లు లేవు.. ఆధారాలతో చెబుతున్నా.. అంబటి సంచలన వ్యాఖ్యలు

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, ఆయన నటించిన బ్రో సినిమాపై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు ఏపీ మంత్రి అంబటి రాంబాబు. పవన్‌కు టీజీ విశ్వప్రసాద్‌ (బ్రో నిర్మాత) నుంచి భారీ ప్యాకేజీ అందుతోందని మంత్రి ధ్వజమెత్తారు. 'పవన్‌ కల్యాణ్‌ బ్రో సినిమాకు కలెక్షన్లు లేవు. సినిమా అట్టర్‌ ప్లాఫ్‌. రాంబాబు, శ్యాంబాబు అని ప్రచారం చేసుకుంటే మరో కోటి రూపాయలు రావచ్చు. పవన్‌కు టీజీ విశ్వప్రసాద్‌..

Ambati Rambabu: 'బ్రో' సినిమాకు కలెక్షన్లు లేవు.. ఆధారాలతో చెబుతున్నా.. అంబటి సంచలన వ్యాఖ్యలు
Minister Ambati Rambabu
Follow us

|

Updated on: Aug 01, 2023 | 5:10 PM

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, ఆయన నటించిన బ్రో సినిమాపై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు ఏపీ మంత్రి అంబటి రాంబాబు. పవన్‌కు టీజీ విశ్వప్రసాద్‌ (బ్రో నిర్మాత) నుంచి భారీ ప్యాకేజీ అందుతోందని మంత్రి ధ్వజమెత్తారు. ‘పవన్‌ కల్యాణ్‌ బ్రో సినిమాకు కలెక్షన్లు లేవు. సినిమా అట్టర్‌ ప్లాఫ్‌. రాంబాబు, శ్యాంబాబు అని ప్రచారం చేసుకుంటే మరో కోటి రూపాయలు రావచ్చు. పవన్‌కు టీజీ విశ్వప్రసాద్‌ నుంచి ప్యాకేజీ అందుతోంది. టీజీ విశ్వప్రసాద్‌కు అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలున్నాయి. చంద్రబాబు ముఠా అమెరికాలో డబ్బులు వసూలు చేసి, విశ్వప్రసాద్‌కు ఇస్తే.. ఆయన ప్యాకేజిని పవన్‌కు అందిస్తారు. చంద్రబాబు ఇవ్వాల్సిన ప్యాకేజీని విశ్వప్రసాద్‌ ద్వారా ఇస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌ ఇప్పటివరకు ఎంతడబ్బు తీసుకున్నారు? ఈ డబ్బును ఐటీలో చూపించారా? లేదా? పవన్‌ ఆన్సర్‌ చెప్పాలి. అలాగే బ్రో సినిమాకు పవన్‌ ఎంత రెమ్యూనరేషన్‌ తీసుకున్నారు? సినిమా ఎందుకు ఫెయిల్‌ అయిందనేది ఆలోచించాలి. విశ్వప్రసాద్‌ బ్లాక్‌ మనీని వైట్‌ మనీగా చేసి పవన్‌కు ఇచ్చే కుట్ర కనిపిస్తోంది’ అని అంబటి ధ్వజమెత్తారు.

కాగా త్వరలోనే పవన్‌ కల్యాణ్‌పై సినిమా తీస్తానని చెప్పుకొచ్చారు మంత్రి అంబటి. ‘ త్వరలోనే పవన్‌పై సినిమా తీస్తా. నలుగురు భార్యలు గుణపాఠం చెప్పే కథ ఇది. ఈ సినిమాకి కొందరు పేర్లు కూడా సూచించారు. నిత్యపెళ్లి కొడుకు, పెళ్లిళ్లు – పెటాకులు, తాళి – ఎగతాళి, మూడు ముళ్లు – ఆరు పెళ్లిళ్లు, బహుభార్యా ప్రవీణుడు, M R O- మ్యారేజెస్‌, రిలేషన్స్‌, అఫెండర్స్‌, అయిన పెళ్లిళ్లు ఎన్నో.. పోయిన చెప్పులు ఎన్నో?’ ఇలా టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. రాజకీయాలు, సినిమాలు చేస్తే రెండింటిలో నష్టపోతారు. గతంలో ఎన్టీఆర్‌, చిరంజీవి కూడా సినిమాలు తీయలేదు. మేం కూడా సినిమా తీయాలనుకుంటున్నాంజ మా కథా వస్తువు ఏంటి అంటే.. మంచి కుటుంబనేపథ్యం.. చిన్న కుటుంబం అన్నదమ్ములు పెద్ద సెలబ్రిటీలు అవుతారు. చదువు సరిగా అబ్బక.. అక్కడక్కడా తప్పిపోతూ ఉన్నాడు. అన్నయ్య దగ్గర కూడా పిచ్చిపిచ్చి వేషాలు వేశారు. రౌడీయిజం చేస్తా. అన్నల్లో కలుస్తా అనేవాడు. ఏ దిక్కులేక సినిమాల్లోకి తీసుకొచ్చారు. అనుకోకుండా పెద్ద సెలబ్రిటీ అయ్యాడు. అభిమానులు హారతులు పడతారు. అయితే మేడిపండు చూడు.. మేలిమై ఉండు అన్నట్టుగా తయారవుతుంది. సంసారం చేస్తూనే మరో మహిళతో సంబంధాలు నలుగురు భార్యలు గుణపాఠం చెప్పే కథ ఇది. కథ కూడా చెప్పాం.దీనిపై చర్చలు జరుగుతున్నాయి. దీనికి పేర్లు, రచనలు జరుగుతున్నాయి’ అని అంబటి ధ్వజమెత్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..