AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: 90 శాతం 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పనులు పూర్తి.. పర్యాటక ప్రాంతంగా ఏర్పాట్లు

విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పనులు ముందుకు సాగుతున్నాయి. బెజవాడ సిటీకి వచ్చిన ప్రతి ఒక్కరు అంబేద్కర్ విగ్రహం గురించి మాట్లాడుకునేలా శరవేగంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. బందర్ రోడ్ PWD గ్రౌండ్‎లో ఏర్పాటు చేస్తున్న ఈ విగ్రహం అత్యంత సుందరంగా బెజవాడ సిటీ వాసులు గర్వించేలా సిద్ధం అవుతుంది.

Andhra Pradesh: 90 శాతం 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పనులు పూర్తి.. పర్యాటక ప్రాంతంగా ఏర్పాట్లు
Ambedkar Statue
P Kranthi Prasanna
| Edited By: Aravind B|

Updated on: Aug 01, 2023 | 4:14 PM

Share

విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పనులు ముందుకు సాగుతున్నాయి. బెజవాడ సిటీకి వచ్చిన ప్రతి ఒక్కరు అంబేద్కర్ విగ్రహం గురించి మాట్లాడుకునేలా శరవేగంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. బందర్ రోడ్ PWD గ్రౌండ్‎లో ఏర్పాటు చేస్తున్న ఈ విగ్రహం అత్యంత సుందరంగా బెజవాడ సిటీ వాసులు గర్వించేలా సిద్ధం అవుతుంది. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా మరిన్ని హంగులతో సిద్ధం అవుతున్న ఈ స్మృతివనం నిర్మాణం గురించి అందరు తెలుసుకోవాల్సిందే.ఇక్కడ ఒక్క అంబేద్కర్ విగ్రహం మాత్రమే కాదు. ఆయన జీవిత విశేషాలు ,వారి జీవితంలో జరిగిన సంఘటనలు ప్రదర్శించేందుకు ఏసీ థియేటర్ ,చక్కటి మ్యూజియం ,గ్రంథాలయం ,విగ్రహం చుట్టూ నీటి కొలను అందులో అదిరిపోయే లైటింగ్‎తో త్వరలోనే విజయవాడ నగరం గొప్ప పర్యాటక ప్రదేశంగా మారబోతుంది.

దాదాపు 400 కోట్ల ఖర్చుతో ఈ విగ్రహ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే పనులు 90 శాతం పూర్తయ్యాయి. వందలాది కార్మికులు పగలనక రాత్రనక కష్టపడుతూనే ఉన్నారు. అతి త్వరలోనే ఇది అందరికి అంబాటులోకి రానుంది. విజయవాడలో ఉన్న ముఖ్యమైన ప్రదేశాల్లో, పర్యాటక ప్రదేశాల్లో టాప్ గా నిలవనున్న ఈ పార్క్ మైన్ రోడ్ పై వెళ్తున్న వారికి సుందరంగా కనిపిస్తుంది. ఇదిలా ఉండగా అంబేద్కర్ విగ్రహాలు దేశంలోని ప్రతి పల్లెలో కనిపిస్తాయి. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కూడా హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ విగ్రహాన్ని ఆవిష్కరణ చేయనున్నారు. దీంతో ఆంధ్ర ప్రజలు ఎప్పుడెప్పుడు అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభిస్తారా అని ఎదురు చూస్తున్నారు. అయితే ఇది పర్యాటక ప్రదేశంగా మారుతుందని అధికారులు చెప్పడంతో ఈ ప్రాంతంలోని వ్యాపారాలు చేసుకునేవారికి కూడా ప్రయోజనకరంగా మారనుంది. అయితే ఈ అంబేద్క్ విగ్రహాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియాలంచే ఇంకొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..