AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T.Congress: మొన్న కర్నాటక .. ఇప్పడు తెలంగాణ.. టి.కాంగ్రెస్ వార్ రూం ఇంచార్జీగా మాజీ ఐఏఎస్..

Sasikanth Senthil: తెలంగాణ విషయంలో ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్న రాహుల్ గాంధీ తెలంగాణ వార్ రూం ఇంచార్జీగా తన కోర్ కమిటీలో మెంబర్ గా ఉన్న శశికాంత్ సెంతిల్ ని నియమించారు. సెంతిల్ మాజీ ఐఏఎస్ అధికారి. NRCకి వ్యతిరేకంగా జరిగిన ఆందోళన సమయంలో సెంథిల్ తన పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తమిళనాడు కి చెందిన సెంథిల్ 2009 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. తన పదవికి 2019లో రిజైన్ చేసినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ...

T.Congress: మొన్న కర్నాటక .. ఇప్పడు తెలంగాణ.. టి.కాంగ్రెస్ వార్ రూం ఇంచార్జీగా మాజీ ఐఏఎస్..
Sasikanth Senthil
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Aug 01, 2023 | 1:48 PM

Share

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ జయకేతనం ఎగిరేసాక తెలంగాణపై ఫోకస్ పెంచింది. తమ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని, తెలంగాణలో తప్పకుండా అధికారంలోకి వస్తామని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ధీమాగా ఉన్నారు. రానున్న డిసెంబర్ 9 న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందనీ పీసీసీ చీఫ్ రేవంత్ కూడా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. తెలంగాణ విషయంలో ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్న రాహుల్ గాంధీ తెలంగాణ వార్ రూం ఇంచార్జీగా తన కోర్ కమిటీలో మెంబర్ గా ఉన్న శశికాంత్ సెంతిల్ ని నియమించారు. సెంతిల్ మాజీ ఐఏఎస్ అధికారి. NRCకి వ్యతిరేకంగా జరిగిన ఆందోళన సమయంలో సెంథిల్ తన పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తమిళనాడు కి చెందిన సెంథిల్ 2009 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. తన పదవికి 2019లో రిజైన్ చేసినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పార్టీ విభాగమైన సర్విద్య సంఘానికి బాధ్యత వహిస్తున్నాడు. పలు అంశాలపై పార్టీ ముఖ్య నేతలకు సెంథిల్ పాఠాలు చెప్తుంటాడు. పార్టీ క్యాడర్ క్లాసుల్లో సిలబస్ కూడా ఆయనే ప్రిపేర్ చేస్తున్నాడు.

శశికాంత్ సెంతిల్ వ్యూహాలు అమలు చేయడంలో దిట్ట. కర్ణాటక ఎన్నికలకు వార్ రూమ్ ఇంచార్జ్ గా పనిచేసిన సెంతిల్ అక్కడ ఎన్నికల్లో ప్రధాన నినాధమైన 40శాతం కమిషన్ సర్కార్ కూడా సెంథిల్ ఆలోచనే. ప్రభుత్వ వైపల్యాలు గ్రౌండ్ లెవల్ కి ఎలా తీసుకెళ్లాలో ప్లాన్ చేయడంలో సెంథిల్ మాస్టర్ మైండ్ అని చెప్పుకోవచ్చు. నాయకుల మధ్య సమన్వయం పెంచడంలో సిద్ధహస్తుడైన సెంథిల్ తెలంగాణ పరిస్థితులను డీల్ చేయగలడనే నమ్మకంతోనే రాహుల్ సెంథిల్ నీ తెలంగాణకి పంపినట్లు సమాచారం

సెంథిల్ ప్రస్తుతం వాయిస్ ఆఫ్ మణిపూర్ అనే పేరుతో మణిపూర్ లో ఏం జరుగుతోందనే విషయాన్ని దేశ ప్రజలకి తెలిసేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. కాంగ్రెస్ ఐడియాలజీ నచ్చి పార్టీలో చేరిన సెంథిల్ ఇప్పటికే పార్టీ వ్యవస్థని పూర్తిగా అర్దం చేసుకున్నారని ఆ పార్టీ జాతీయ నేతలు చెబుతున్నారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చాలా అనుకూలంగా ఉందని కొన్ని వ్యూహాలతో పార్టీని అధికారంలోకి తీసుకు రావచ్చని సెంథిల్ వార్ రూం సభ్యులతో చెబుతున్నట్లు సమాచారం. కర్ణాటకలో 8 నెలల్లో గ్రౌండ్ లెవల్ కి రీచ్ అయ్యామని, తెలంగాణలో కేవలం నాలుగు నెలల సమయం ఉన్నా సరిపోతుందని సెంథిల్ అన్నట్లు సమాచారం

తెలంగాణలో బీజేపీ అంత స్ట్రాంగ్ కాదని ఆ పార్టీని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదని సెంథిల్ అభిప్రాయ పడుతున్నారట. బీజేపీ ఊపులో తెలంగాణలో కాస్త స్ట్రాంగ్ గా కనిపించినా ఆ పార్టీకి గ్రౌండ్ లెవల్ క్యాడర్ లేదని, తెలంగాణలో ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా కాంగ్రెస్ కార్యకర్తలు కనీసం 50 నుండి 100 మంది ఉన్నారట. అయితే పార్టీకి నాయకులకు, క్యాడర్ కి మధ్య కనెక్షన్ మిస్ అయిందని వాళ్ళని కనెక్ట్ చేయగలిగితే క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ కి తిరుగు ఉండదనేది సెంథిల్ చెపుతున్నారట.

రాహుల్ ఇమేజ్ కూడా తెలంగాణలో వర్కవుట్ అవుతుందని, పెద్ద లీడర్లు లెగ్ వర్క్ ఎక్కువగా చేస్తే క్యాడర్ కి రీచార్జ్ అవుతుందని ఆ తరహా పెద్ద లీడర్లందరూ నాలుగు నెలలు రోడ్లపై ఉండేలా కార్యక్రమాలు రూపొందించే పనిలో సెంథిల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక నాయకుల మధ్య సమన్వయం ఉండాల్సిందే అని సెంథిల్ చెప్పడంతోనే ఇటీవల కాంగ్రెస్ నేతలు ఐక్యతరాగం తీసుకున్నారని, ఆయన గైడెన్స్ ప్రకారమే అందరూ కలిసి బస్ యాత్ర ప్రకటించినట్లు తెలుస్తోంది.

ఎన్నికల సమయానికి బీజేపీ విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తుందని దాన్ని అడ్డుకోవాలని, అధికార పార్టీని 30 శాతం కమీషన్ సర్కార్ అనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆవిధమైన కార్యక్రమాలు రూపొందించాలని తన వార్ రూం సభ్యులతో సెంథిల్ చెప్పినట్లు సమాచారం. కర్ణాటకలో సక్సెస్ అయిన సెంథిల్ మంత్రం తెలంగాణలో ఎంత వరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

Follow Us