KGMU: దేవుళ్లు సామీ మీరు.. 26 సంవత్సరాలుగా ఎగ్జామ్ రాస్తున్నారు.. 1 సెమ్ కూడా పాస్ అవ్వలేదు.. చివరకు..
KGMU: లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీకి చెందిన నలుగురు విద్యార్థులను యూనివర్సిటీ అధికారులు తొలగించారు. వారి అడ్మిషన్‌ను క్యాన్సిల్ చేశారు. దీనికి చాలా పెద్ద రీజనే ఉందండోయ్. అదేంటో తెలిస్తే మీరూ అవాక్కవుతారు. ఈ ఘనాపాటీలు ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 26 సంవత్సరాలుగా ఎగ్జామ్స్ రాస్తున్నప్పటికీ.. ఫస్ట్ సెమ్ పాస్ అవడం లేదు. వీరిలో..
KGMU: ఎవరైనా చదువుకునే విద్యార్థులు ఒక ఎగ్జామ్‌లో ఫెయిల్ అయితే, సప్లిమెంటరీలో ఆ సబ్జెక్టు, సబ్లెక్టులను వెల్లదీస్తారు. కొందరు మాత్రం తమ సబ్జెక్ట్‌లు పాస్ అయ్యేందుకు రెండు, మూడు సంవత్సరాలు టైమ్ తీసుకుంటారు. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఘనాపాటీలు మాత్రం ఏకంగా 26 సంవత్సరాలుగా ఎగ్జామ్స్ రాస్తున్నారు. అయినప్పటికీ వారు కనీసం ఫస్ట్ సెమ్ కూడా పాస్ కాలేకపోయారు. దాంతో ఇక చాలురా బాబూ అంటూ యూనివర్సిటీ వారికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. మరి గిఫ్ట్ ఏంటి? వారు ఏం చేశారు? ఇంట్రస్టింగ్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీకి చెందిన నలుగురు విద్యార్థులను యూనివర్సిటీ అధికారులు తొలగించారు. వారి అడ్మిషన్‌ను క్యాన్సిల్ చేశారు. దీనికి చాలా పెద్ద రీజనే ఉందండోయ్. అదేంటో తెలిస్తే మీరూ అవాక్కవుతారు. ఈ ఘనాపాటీలు ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 26 సంవత్సరాలుగా ఎగ్జామ్స్ రాస్తున్నప్పటికీ.. ఫస్ట్ సెమ్ పాస్ అవడం లేదు. వీరిలో ఒకరు 1997 బ్యాచ్‌కు చెందినవారు కాగా, మరో ముగ్గురు 1999, 2001, 2006 బ్యాచ్‌లకు చెందినవారు ఉన్నారు.
వీరి పరీక్షలు క్లియర్ చేయడానికి యూనివర్సిటీ అనేక అవకాశాలు కల్పించినప్పటికీ.. వారు ఎగ్జామ్స్ పాస్ అవ్వలేకపోయారు. వీరికోసం ప్రత్యేక తరగతులు నిర్వహించడం, ప్రాక్టీస్ ఎగ్జామ్స్, అనేక విధాలుగా వారిని మోటివేట్ చేసినప్పటికీ.. ఉపయోగం లేకుండాపోయింది. ఇన్నేళ్లయినా.. ఈ నలుగురు విద్యార్థులు కనీసం ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా పాస్ కాకపోవడంతో వారి అడ్మిషన్‌ను క్యాన్సిల్ చేయాలని కేజీఎంయూ ఎగ్జిక్యూటీవ్ కౌన్సిల్ నిర్ణయించింది. ఈ మేరకు ఒక ప్రకటన రిలీజ్ చేసిన విశ్వవిద్యాలయం అధికారులు.. వారి అడ్మిషన్లను రద్దు చేసింది.
అంతేకాదు.. ఎగ్జిక్యూటీవ్ కౌన్సిల్ ఇలాంటి 37 మంది విద్యార్థులను గుర్తించింది. వీరంతా 10 సంవత్సరాలుగా ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అవుతున్నట్లుగా గుర్తించారు. అయితే, ఎంబీబీఎస్ పూర్తి చేయడానికి కేజీఎంయూకి నిర్ణీత వ్యవధి అంటూ ఏమీ లేదు. ఈ కారణంగా చాలా మంది విద్యార్థులు తమ కోర్సును కంప్లీట్ చేయడానికి సంవత్సరాల తరబడి ఎగ్జామ్స్ రాస్తూనే ఉన్నారు.
అయితే, నేషనల్ మెడికల్ కమిషన్(NMC) కొత్త నిబంధనల ప్రకారం.. విద్యార్థులు 10 సంవత్సరాల లోపు ఎంబీబీఎస్ పూర్తి చేయాలి. ఈ నిబంధనలకు అనుగుణంగా తాజాగా 4 విద్యార్థుల అడ్మిషన్‌ను రద్దు చేసింది యూనివర్సిటీ. అంతేకాదు.. ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం తరగతులకు హాజరుకాని విద్యార్థుల అడ్మిషన్లను కూడా విశ్వవిద్యాలయం క్యాన్సిల్ చేస్తుందని ప్రకటనలో తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..