AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ఈ 5 అలవాట్లు వెంటనే మార్చుకోండి.. లేదంటే జీవితమే అస్తవ్యస్థం అయ్యే ప్రమాదం ఉంది..

చాలా మంది తమ రోజును కాఫీ, టీ తో ప్రారంభిస్తారు. అయితే, అధిక కెఫిన్ తీసుకోవడం వలన తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది. ఆందోళనను కలిగించడంలో కెఫిన్ ఉద్దీపనగా పని చేస్తుంది. హృదయ స్పందన రేటును పెంచుతుంది. నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుంది. అశాంతి, ఆందోళ భావాలను కలిగిస్తుంది. ముఖ్యంగా మధ్యాహ్నం, సాయంత్రం కెఫిన్ తీసుకోవడం మానేయడం ఉత్తమం. దీని వల్ల మంచి నిద్ర వస్తుంది. ఆందోళన తగ్గుతుంది.

Health Tips: ఈ 5 అలవాట్లు వెంటనే మార్చుకోండి.. లేదంటే జీవితమే అస్తవ్యస్థం అయ్యే ప్రమాదం ఉంది..
Bad Habits
Shiva Prajapati
|

Updated on: Jul 30, 2023 | 1:35 PM

Share

Habits of Anxiety: పరిస్థితుల ప్రభావం, సరికాని జీవనశైలి కారణంగా చాలా మంది తీవ్రమైన ఒత్తిడితో, ఆందోళనతో ఉంటారు. ప్రస్తుతం ఇది ప్రపంచ వ్యాప్తంగా తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్యగా మారింది. ఆందోళనకు అనేక కారణాలు ఉన్నప్పటికీ.. కొన్ని రోజువారీ అలవాట్లు ఆ సమస్యను మరింత పెంచుతాయి. మంచి అలవాట్లను పెంచుకుంటూ.. మానసిక ఆందోళనలను పెంచే అలవాట్లను దూరం చేసుకోవడమే ఇందుకు ఉత్తమమైన మెడిసిన్. మరి ఒత్తిడిని పెంచే అలవాట్లు ఏంటో ఇవాళ మనం తెలుసుకుందాం..

కెఫిన్ తీసుకోవడం..

చాలా మంది తమ రోజును కాఫీ, టీ తో ప్రారంభిస్తారు. అయితే, అధిక కెఫిన్ తీసుకోవడం వలన తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది. ఆందోళనను కలిగించడంలో కెఫిన్ ఉద్దీపనగా పని చేస్తుంది. హృదయ స్పందన రేటును పెంచుతుంది. నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుంది. అశాంతి, ఆందోళ భావాలను కలిగిస్తుంది. ముఖ్యంగా మధ్యాహ్నం, సాయంత్రం కెఫిన్ తీసుకోవడం మానేయడం ఉత్తమం. దీని వల్ల మంచి నిద్ర వస్తుంది. ఆందోళన తగ్గుతుంది.

డిజిటల్ కనెక్టివిటీ..

సోషల్ మీడియా, స్క్రీన్‌లకు అతిగా కనెక్ట్ కావడం కూడా ఆందోళన స్థాయిని పెంచుతుంది. చాలామంది ఉదయం నిద్రలేవగానే తమ ఫోన్లను చెక్ చేస్తారు. తద్వారా దేశంలో జరుగుతున్న వార్తలు, సంఘటనలు మీలో ఆందోళనను కలిగిస్తాయి. సోషల్ మీడియాకు, డిజిటల్ మీడియాకు కాస్త దూరంగా ఉండండి. స్క్రీన్ ఫ్రీగా ఉండేందుకు ప్రయత్నించాలి. అప్పుడే మానసిక ప్రశాంతత లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

నిద్ర లేకపోవడం..

నిద్ర లేకపోవడం లేదా క్రమరహిత నిద్ర విధానాలు కూడా మానసిక ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. నాణ్యమైన నిద్ర లేకపోవడం ఆందోళన లక్షణాలను తీవ్రతరం చేస్తుంది. అభిజ్ఞా పనితీరును బలహీనపరుస్తుంది. రోజువారీ ఒత్తిడిని ఎదుర్కోవడం కష్టతరం చేస్తుంది. స్థిరమైన నిద్ర షెడ్యూల్‌ను నిర్వహించడం, ప్రశాంత వాతావరణంలో నిద్రపోవడం వలన ఆందోళన సమస్యలు తగ్గుతాయి.

వ్యాయామం లేకపోవడం..

శారీరక శ్రమ లేకుండా ఉండటం వలన మానసిక ఆందోళన స్థాయిలు పెరుగుతాయి. అందుకే రెగ్యులర్‌గా వ్యాయామం చేయాలి. వ్యాయామం చేయడం వలన ఎండార్ఫిన్‌లను విడుదల చేస్తుంది. ఇవి సహజమైన మానసిక స్థితిని కలిగిస్తాయి. ఒత్తిడిని తగ్గిస్తాయి. రోజూ కాసేపు నడవడం గానీ, చిన్న చిన్న వ్యాయామాలు గానీ చేయాలి.

స్వీయ సంరక్షణ లేకపోవడం..

చాలా మంది తమను తాము నిర్లక్ష్యం చేసుకుంటారు. ఇది కూడా వారిలో ఆందోళనలను పెంచుతుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కాసేప గడపాలి. మీకు నచ్చిన పనులు చేయాలి. ఇందుకోసం కాస్త సమయం కేటాయించుకోవాలి. ఇలా చేయడం వలన ఆందోళన, ఒత్తిడి తగ్గుతుంది.

గమనిక: పైన పేర్కొన్న వివరాలు.. ఆరోగ్య నిపుణులు అందించిన సూచనల మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు. ఏవైనా అనారోగ్య సమస్యలుంటే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..