AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: కాలేయం క్లీన్ గా ఉండాలంటే.. ఈ వెజిటేబుల్స్ తినాల్సిందే!

మానవుడి శరీరంలో కాలేయం పాత్ర ఎంతో ముఖ్యమైనది. ఆరోగ్యం అంతా కాలేయం పైనే ఆధారపడి ఉంటుంది. కాలేయంలో ఏ చిన్న సమస్య తలెత్తినా.. ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాలేయాన్ని ఆరోగ్యంగా కాపాడుకోవాలంటే చికెన్, మటన్ కన్నా కూరగాయలు ఎంతో..

Health Tips: కాలేయం క్లీన్ గా ఉండాలంటే.. ఈ వెజిటేబుల్స్ తినాల్సిందే!
Liver
Chinni Enni
|

Updated on: Jul 30, 2023 | 4:00 PM

Share

మానవుడి శరీరంలో కాలేయం పాత్ర ఎంతో ముఖ్యమైనది. ఆరోగ్యం అంతా కాలేయం పైనే ఆధారపడి ఉంటుంది. కాలేయంలో ఏ చిన్న సమస్య తలెత్తినా.. ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాలేయాన్ని ఆరోగ్యంగా కాపాడుకోవాలంటే చికెన్, మటన్ కన్నా కూరగాయలు ఎంతో హెల్ప్ చేస్తాయి. కామెర్లు నుంచి కొవ్వు కాలేయ సిండ్రోమ్ వరకు కాలేయాన్ని ఎన్నో వ్యాధులు దెబ్బతీస్తాయి. అందుకే కాలేయం పట్ల జాగ్రత్తగా ఉండాలి. కాలేయం ఆరోగ్యంగా ఉండేందుకు ఏ కూరగాయలు సహాయపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

బ్రోకలీ: బ్రోకలీలో సల్ఫర్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. కాలేయంలోని టాక్సిన్స్ ను బయటకు పంపడానికి ఈ కూరగాయ బాగా సహయపడుతుంది. అంతేకాకుండా బ్రోకలీని ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరానికి కూడా మంచింది.

క్యాబేజీ: క్యాబేజీలో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. క్యాబేజీలో విటమిన్ ఎ, విటమిన్ బి2, విటమిన్ సిలతో పాటుగా మెగ్నీషియం, క్యాల్షియం, ఫాస్పరస్, ఐరన్, సోడియం, పొటాషియం, సల్ఫర్ లు అధికంగా ఉంటాయి. ఇవి కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

ఇవి కూడా చదవండి

కాలీఫ్లవర్: కాలీఫ్లవర్ లో పుష్కలంగా విటమిన్లు ఉంటాయి. దీనిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి6, విటమిన్ బి5, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్స్, ఐరన్, క్యాల్షియం లాంటివి కాలీఫ్లవర్ లో అధికంగా ఉంటాయి. అందుకోసమని ఇది తింటే కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది.

బీట్ రూట్: ఈ కూరగాయలో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ అధికంగా ఉంటాయి. బీట్ రూట్ లో నైట్రేట్లు ఎక్కువ మొత్తంలో లభిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్ కూడా కలిగి ఉంటుంది. బీట్ రూట్ కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం..