Ant Honey Benefits: ‘చీమల తేనె’.. దీంతో అన్ని ఇన్ ఫెక్షన్లకు చెక్

చీమల తేనె ఏంటి అని షాక్ అవుతున్నారా.. అవును మీరు విన్నది నిజమే. తేనెటీగల తేనె గురించి విన్నాం కానీ.. చీమల తేనె ఏంటా? అని ఆలోచనలో పడ్డారా.. దీని గురించి చాలా తక్కువ మందికి తెలుసు. కానీ ఈ చీమల తేనెతో ఎన్నో ఇన్ ఫెక్షన్ లకు చెక్ పెట్టవచ్చు. ఆస్ట్రేలియన్లు శతాబ్దాలుగా ఉపయోగిస్తున్న ఈ యాంట్ హనీలో..

Ant Honey Benefits: 'చీమల తేనె'.. దీంతో అన్ని ఇన్ ఫెక్షన్లకు చెక్
Ant Honey
Follow us

|

Updated on: Jul 30, 2023 | 12:39 PM

చీమల తేనె ఏంటి అని షాక్ అవుతున్నారా.. అవును మీరు విన్నది నిజమే. తేనెటీగల తేనె గురించి విన్నాం కానీ.. చీమల తేనె ఏంటా? అని ఆలోచనలో పడ్డారా.. దీని గురించి చాలా తక్కువ మందికి తెలుసు. కానీ ఈ చీమల తేనెతో ఎన్నో ఇన్ ఫెక్షన్ లకు చెక్ పెట్టవచ్చు. ఆస్ట్రేలియన్లు శతాబ్దాలుగా ఉపయోగిస్తున్న ఈ యాంట్ హనీలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయని పలువురు శాస్త్రవేత్తలు కూడా వెల్లడించారు.

ఆస్ట్రేలియన్లు ఎక్కువగా దీన్ని ఉపయోగిస్తూంటారు. ఈ తేనెలో యాంటీ మైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉండటం వల్ల అక్కడి ప్రజలు జలుబు, అంటు వ్యాధులు, గొంతు నొప్పికి చికిత్సగా దీన్ని తరతరాలుగా ఉపయోగిస్తున్నారు.

వాస్తవానికి హనీపాట్ చీమ జాతి ఎడారి ప్రాంతాల్లో ముఖ్యంగా పశ్చిమ ఆస్ట్రేలియా, ఉత్తర భూభాగంలో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ చీమలు తరచూ ఆహార సేకరణలో నిమగ్నమై ఉంటాయి. వాటి పొత్తికడుపులో తేనె స్టోర్ అయి ఉండటం వల్ల అది కాషాయ రంగులో ఉబ్బినట్టు కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఆహార కొరత ఏర్పడినప్పుడు ఈ హనీపాట్ యాంట్స్ తమ పొత్తికడుపులో స్టోర్ చేసుకున్న తేనెను ఉపయోగించుకుని జీవిస్తూ ఉంటాయి. ఈ తేనెతో వివిధ రకాల ఇన్ ఫెక్షన్లు, గాయాలు అయినప్పుడు లేపనంగా కూడా దీన్ని ఉపయోగిస్తారు. భవిష్యత్తులో కూడా యాంటీ మైక్రోబయల్ ఆధారిత మెడిసిన్ తయారీకి ఉపయోగించుకునే దిశగా తమ పరిశోధనలు కొనసాగుతున్నాయని సైంటిస్టులు వెల్లడించారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం..