Health Tips: పెరుగుతున్న కండ్లకలక కేసులు.. ఈ జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రమాదమే!!
కండ్ల కలక వచ్చిన వారు కంటిని తరుచూ మంచి నీళ్లతో కడుక్కోవాలి. దీనివల్ల త్వరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. కండ్లకలక వచ్చిన వారు మిగతా వారికి దూరంగా ఉండాలి. వాళ్లు వాడిన వస్తువులను ఇతరులు వాడకూడదు. సబ్బుతో చేతులను క్రమం తప్పకుండా..
ప్రస్తుతం కురిసిన నాన్ స్టాప్ వర్షాలతో కండ్లకలక కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కండ్ల కలకనే పింక్ ఐ అని కూడా అంటారు. వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉండే కారణంగా బ్యాక్టీరియా త్వరగా వ్యాప్తి చెందుతుంది. ఫలితంగా కళ్ళు కండ్లకలక బారిన పడతాయి. కండ్లకలకకు సరైనా నివారణ చర్యలు తీసుకోకపోతే.. పరిస్థితి అదుపు తప్పుతుంది. మరి ఈ కండ్లకలకకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
-కండ్ల కలక వచ్చిన వారు కంటిని తరుచూ మంచి నీళ్లతో కడుక్కోవాలి. దీనివల్ల త్వరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. కండ్లకలక వచ్చిన వారు మిగతా వారికి దూరంగా ఉండాలి. వాళ్లు వాడిన వస్తువులను ఇతరులు వాడకూడదు. సబ్బుతో చేతులను క్రమం తప్పకుండా కడుక్కోవాలి.
-కండ్లకలక కారణంగా కళ్లు దురదగా అనిపిస్తే పదే పదే రుద్దకూడదు. కళ్ళు తుడుచుకోవడానికి శుభ్రమైన క్లాత్ కానీ టిష్యూ పేపర్ కానీ వాడాలి.
-అలాగే కండ్లకలక నివారణకు మెడికల్ షాపులో దొరికే ఆర్టిఫిషియల్ టియర్స్ ని వాడటం వల్ల ఫలితం ఉంటుంది.
-కండ్ల కలక ఉన్న వ్యక్తి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. దుమ్ము, ధూళి వల్ల కూడా ఈ కండ్ల కలక మరింత ఎక్కువగా వస్తుంది.
-కండ్ల కలక ఉన్న వ్యక్తి పర్సనల్ థింగ్స్ అస్సలు షేర్ చేసుకోకూడదు. టవల్స్, హాంకీలు, ఐ మేకప్, కాంటాక్ట్ లెన్స్‌ల ద్వారా కండ్లకలక సులభంగా వ్యాప్తి చెందుతుంది.
-ఖనిజాలు, విటమిన్లు అధికంగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారం, ముఖ్యంగా విటమిన్ ఎ.. కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఆకుపచ్చ ఆకు కూరలు, క్యారెట్లు, సిట్రస్ ఫ్రూట్స్, ఇతర పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను తీసుకుంటే మంచింది.
-వర్షాకాలంలో రద్దీగా ఉండే ప్రదేశాల్లో తిరగకూడదు. అలాంటి ప్రదేశాల్లో ఇన్ఫెక్షన్ ఇంకా ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి రద్దీగా ఉండే ప్రాంతాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం..