Kitchen Tips: పప్పులకు పురుగు పడుతుందా.. ఈ టిప్స్ ఫాలో అయితే ఇక పట్టవు

కొంతమంది ఏడాది సరిపడగా బియ్యం, పప్పు ధాన్యాలు ఒకేసారి కొనేస్తారు. అవి పాడవ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటూంటారు. అయినా కూడా పప్పులు, బియ్యం పురుగులు పడుతూ ఉంటాయి. అందులోనూ వర్షాకాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా..

Kitchen Tips: పప్పులకు పురుగు పడుతుందా.. ఈ టిప్స్ ఫాలో అయితే ఇక పట్టవు
kitchen tips
Follow us
Chinni Enni

|

Updated on: Jul 29, 2023 | 3:28 PM

కొంతమంది ఏడాది సరిపడగా బియ్యం, పప్పు ధాన్యాలు ఒకేసారి కొనేస్తారు. అవి పాడవ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటూంటారు. అయినా కూడా పప్పులు, బియ్యం పురుగులు పడుతూ ఉంటాయి. అందులోనూ వర్షాకాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే.. పప్పులకు, బియ్యానికి పురుగులు పట్టకుండా కాపాడుకోవచ్చు. మరి ఆ టిప్స్ ఏంటో చూసేయండి.

1.ఎండు మిర్చి: మీరు పప్పులు స్టోర్ చేసే డబ్బాల్లో లేక సంచుల్లో ఎండుమిర్చీ ఉంచితే పురుగులు పట్టవు. ఎండు మిర్చీ ఘాటుకు పురుగులు దూరంగా ఉంటాయి.

2. వెల్లుల్లి: మీరు స్టోర్ చేసిన పప్పుల డబ్బాల్లో, బియ్యం సంచుల్లో పొట్టుతీయని వెల్లుల్లి రెబ్బలు ఉంచితే పురుగులు పట్టకుండా ఉంటాయి. అలాగే అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. వెల్లుల్లి ఎండిపోతే అవి తీసేసి.. మళ్లీ ఫ్రెష్ వెల్లుల్లి పెట్టవచ్చు.

ఇవి కూడా చదవండి

3. ఎండు వేపాకులు: పప్పులకు, బియ్యంకు పురుగు పట్టకుండా ఉంచేందుకు మరో చిట్కా ఏంటంటే.. ఎండు వేపాకులు. వీటిని ఎన్నో ఏళ్లుగా పెద్దలు చిట్కాగా వాడుతూంటారు. మీరు పప్పులు, బియ్యం స్టోర్ చేసే డబ్బాల్లో ఎండిపోయిన వేపాకులు ఉంచితే.. కీటకాలు, పురుగులు దరిచేరకుండా రక్షిస్తుంది.

4. లవంగాలు: లవంగాలు వంట రుచిని పెంచడమే కాదు.. క్రిమికీటకాల నుంచి కూడా రక్షిస్తాయి. మీరు చేయాల్సిందల్లా పప్పులు స్టోర్‌ చేసిన డబ్బాల్లో 8-10 లవంగాలు వేసిన క్లాత్‌ బ్యాగ్‌ ఉంచండి. ఆ డబ్బాకు గాలి చొరబడకుండా చూసుకోండి చాలు. ఇలా చేస్తే పప్పులకు, బియ్యంకు పురుగు పట్టకుండా ఉంటుంది.

5. పప్పులకు పురుగు పట్టకుండా ఉండేందుకు మరో టిప్ ఏంటంటే.. వాటిని ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోవచ్చు. పప్పులకు పురుగు పట్టకుండా.. ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది. మీరు వాటిని గాలి చొరబడని కంటైనర్ లలో లేదా జిప్ లాక్ ప్యాకెట్లలో అయినా నిల్వ చేయవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం..