Skin Precautions: మీరు స్వీట్లు తింటున్నారా.. అయితే తొందరగా వృద్ధ్యాపం వచ్చే ప్రమాదం ఉంది!!

తరుచుగా ఈ స్వీట్స్ తినడం వల్ల ఆరోగ్యంపై చాలా ప్రభావం పడుతుందట. ముఖ్యంగా మధుమేహం(డయాబెటీస్)వచ్చే ప్రమాదం ఉంది. అలాగే చిన్నప్పటి నుంచే స్వీట్స్ మరీ ఎక్కువగా తింటే స్కిన్ పై ముడతలు వస్తాయి. దీంతో చిన్న వయసులోనే పెద్దవారిలా కనిపించే అవకాశాలు..

Skin Precautions: మీరు స్వీట్లు తింటున్నారా.. అయితే తొందరగా వృద్ధ్యాపం వచ్చే ప్రమాదం ఉంది!!
Skin Precautions
Follow us

|

Updated on: Jul 29, 2023 | 12:23 PM

తీపి పదార్థాలంటే చాలా మందికి ఇష్టం. స్వీట్స్ ను చూస్తే నోట్లో వేసుకోకుండా ఆగలేరు. ఒక్కొక్కరు ఒక్కో రకమైన స్వీట్ ను చూస్తే అస్సలు ఉండలేరు. మరికొంతమంది అదేపనిగా స్వీట్స్ తింటూంటారు. అయితే ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదని చెబుతున్నారు నిపుణులు. తరుచుగా ఈ స్వీట్స్ తినడం వల్ల ఆరోగ్యంపై చాలా ప్రభావం పడుతుందట. ముఖ్యంగా మధుమేహం(డయాబెటీస్)వచ్చే ప్రమాదం ఉంది. అలాగే చిన్నప్పటి నుంచే స్వీట్స్ మరీ ఎక్కువగా తింటే స్కిన్ పై ముడతలు వస్తాయి. దీంతో చిన్న వయసులోనే పెద్దవారిలా కనిపించే అవకాశాలు లేకపోలేదు. ముఖ్యంగా చర్మ సౌందర్యం తగ్గిపోతుంది. మొటిమలు కూడా వస్తాయి. మరి తీపి పదార్థాలు ఎక్కువ తింటే చర్మంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

*ముడతలు: స్వీట్లలో ఉండే చక్కెర.. గ్లైకేషన్ అనే ప్రక్రియను బాగా ప్రొత్సహిస్తుంది. దీంతో చర్మంలోని కొల్లైజెన్, ఎలాస్టిన్ ఫైబర్ లతో కలుస్తాయి. దీని వల్ల ముడతలు త్వరగా వస్తాయి. ఇది త్వరగా వృద్ధ్యాప్యం వచ్చేలా చేస్తుంది. కాబట్టి స్వీట్లు ఎక్కువగా తినేవారు దీన్ని గమనించాలి.

*జిడ్డు: తీపిపదార్థాలు ఎక్కువగా తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిలో పెరుగుదలకు దారి తీస్తుంది. పెరిగిన ఇన్సులిన్ స్థఆయిలు సెబాషియన్ గ్రంథులను మరింతగా సెబమ్ ఉత్పత్తి చేసేలా ప్రేరేపిస్తాయి. ఈ అదనపు సెబమ్ వల్ల చర్మం జిడ్డుగా తయారవుతుంది. స్వీట్లు ఎక్కువగా తినడం వల్ల శరీరానికి చేకూరే ప్రయోజనం ఏమీ ఉండదు.

ఇవి కూడా చదవండి

*మొటిమలు:  స్వీట్లు ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఇన్ ప్లమ్మేషన్ పెరుగుతుంది. ఇది చర్మంపై మొటిమలు వచ్చేలా చేస్తుంది.  అంతేకాకుండా అధిక చక్కెర తీసుకోవడం ద్వారా సెబమ్ ఉత్పత్తి పెరిగేలా చేస్తుంది. దీంతో సెబమ్ చర్మ రంధ్రాలను మూసి వేసి.. మొటిమలు వచ్చేందుకు దారి తీస్తుంది.

అలాగే ఎక్కువగా చక్కెర పదార్థాలు తినడం ద్వారా డయాబెటీస్ కూడా తొందరగా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి స్వీట్లు తినేటప్పుడు ఇవన్నీ ఆలోచించండి. ఇక స్వీట్లు పంచదారతో తయారు చేసినవి కాకుండా.. బెల్లంతో చేసే పదార్థాలు తినడం వల్ల ఆనందానికి ఆనందం, ఆరోగ్యానికి ఆరోగ్యం మన సొంతమవుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం..

ఏంది మచ్చా ఇది.. 1504 వికెట్లు తీసిన దిగ్గజాలకే దడ పుట్టించావ్
ఏంది మచ్చా ఇది.. 1504 వికెట్లు తీసిన దిగ్గజాలకే దడ పుట్టించావ్
మరికాసేపట్లో పార్లమెంట్‌లో ఆర్థిక సర్వే.. రిలీజ్ చేసేది ఎవరంటే..?
మరికాసేపట్లో పార్లమెంట్‌లో ఆర్థిక సర్వే.. రిలీజ్ చేసేది ఎవరంటే..?
Horoscope Today: ఆర్థిక లావాదేవీల విషయంలో ఆ రాశివారు జాగ్రత్త..
Horoscope Today: ఆర్థిక లావాదేవీల విషయంలో ఆ రాశివారు జాగ్రత్త..
బాత్ రూంలో అనుమానాస్పద మృతి.. రంగంలోకి క్లూస్ టీం..
బాత్ రూంలో అనుమానాస్పద మృతి.. రంగంలోకి క్లూస్ టీం..
వెండి ఆభరణాలకు మెరుగుపెట్టి.. ఆ పనిచేస్తూ దొరికిపోయిన మోసగాళ్లు..
వెండి ఆభరణాలకు మెరుగుపెట్టి.. ఆ పనిచేస్తూ దొరికిపోయిన మోసగాళ్లు..
తిరుపతిలో ఆ స్థానంపై కన్నేసిన టీడీపీ.. ఆయోమయంలో లోకల్ లీడర్లు..
తిరుపతిలో ఆ స్థానంపై కన్నేసిన టీడీపీ.. ఆయోమయంలో లోకల్ లీడర్లు..
ఈ వస్తువులు ఎవ్వరికీ ఇవ్వకూడదు.. వాస్తు శాస్త్రం ఇదే చెబుతోంది..
ఈ వస్తువులు ఎవ్వరికీ ఇవ్వకూడదు.. వాస్తు శాస్త్రం ఇదే చెబుతోంది..
క్రికెటర్ అవ్వాలని.. స్టోర్ మేనేజర్‏గా మారాడు.. తెలుగులో ఫేమస్..
క్రికెటర్ అవ్వాలని.. స్టోర్ మేనేజర్‏గా మారాడు.. తెలుగులో ఫేమస్..
మిర్చి లారీని ఆపిన పోలీసులు.. దర్యాప్తులో షాకింగ్ నిజాలు..
మిర్చి లారీని ఆపిన పోలీసులు.. దర్యాప్తులో షాకింగ్ నిజాలు..
2024లో విడాకులు తీసుకున్న సెలబ్రెటీ జంటలు..
2024లో విడాకులు తీసుకున్న సెలబ్రెటీ జంటలు..