Beauty Tips: ఫేస్ మీద మచ్చలు పోవాలా.. తేనెలో వీటిని కలిపి రాస్తే సూపర్ రిజల్ట్ ఉంటుంది!!

సాధారణంగా చాలా మంది ముఖం మీద మచ్చలతో బాధపడుతూంటారు. బయటకు రావాలన్నా.. నలుగురిలో తిరగాలన్నా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఇటువంటి వారు ఇంటిలోని దొరికే కొన్ని ఐటెమ్స్ తో ఆ మచ్చలకు..

Beauty Tips: ఫేస్ మీద మచ్చలు పోవాలా.. తేనెలో వీటిని కలిపి రాస్తే సూపర్ రిజల్ట్ ఉంటుంది!!
Beauty Tips
Follow us
Chinni Enni

|

Updated on: Jul 30, 2023 | 11:28 AM

సాధారణంగా చాలా మంది ముఖం మీద మచ్చలతో బాధపడుతూంటారు. బయటకు రావాలన్నా.. నలుగురిలో తిరగాలన్నా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఇటువంటి వారు ఇంటిలోని దొరికే కొన్ని ఐటెమ్స్ తో ఆ మచ్చలకు చెక్ పెట్టవచ్చు. ఈ మచ్చలకు తేనె మంచిగా పని చేస్తుంది. తేనెని ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతూంటారు. మరి అలాంటి తేనెతో అందాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం.

1. పసుపు-తేనె కలిపి రాయడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది. పసుపులో ఉంటే కర్కమిన్ చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. తేనె ఫేస్ ని మృదువుగా మారుస్తుంది. రెండు టేబుల్ స్పూన్ల తేనెకి, అర టీ స్పూన్ పసుపు వేసి బాగా కలిపి రాయాలి. దీనిని ఫేస్ కి అప్లై చేసి 20 నిమిషాలు ఉంచి కడిగేసుకోవాలి.

2. పెరుగు-తేనె మిశ్రమాన్ని కలిసి ముఖానికి రాయడం వల్ల స్కిన్ యవ్వనంగా, మృదుగా మారుతుంది. పెరుగు వాడటం వల్ల చర్మానికి మాయిశ్చరైజింగ్ ఫీలింగ్ వస్తుంది. చర్మం కాంతివంతంగా కూడా మారుతుంది. రెండు టేబుల్ స్పూన్ల పెరుగుకి, ఒక టేబుల్ స్పూన్ తేనె తీసుకుని వీటిని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల పాటు అలానే ఉంచుకోవాలి. బాగా ఆరాక గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడగాలి.

ఇవి కూడా చదవండి

3. స్కిన్ కి జోజోబా ఆయిల్ చాలా మంచిది. ఈ నూనెలో విటమిన్ ఇ, సిలు పుష్కలంగా ఉంటాయి. నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ కి, ఒక టేబుల్ స్పూన్ తేనె వేసి బాగా కలపాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి బాగా మసాజ్ చేయాలి. 20 నిమిషాల తర్వాత ఉంచి.. గోరువెచ్చటి నీటితో ఫేస్ క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా స్కిన్ మాయిశ్చరైజింగ్ గా మెరిసిపోతుంది. ఇలా చేయడం ద్వారా ముఖానికి మంచి గ్లో వస్తుంది.

ఇలా సింపుల్ టిప్స్ ని ఇంట్లో పాటించండి. ఒకవేళ అప్పటికీ మీకు మార్పు కనిపించకపోతే డాక్టర్ ని సంప్రదించడం మేలు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం..