AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kitchen Tips: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ చికెన్ స్వీట్ కార్న్ సూప్.. ఇలా చేసుకోండి సూపర్ అంతే!!

వర్షాకాలంలో, శీతాకాలంలో వేడి వేడిగా ఏమాన్నా తినాలి, తాగాలి అనిపిస్తుంది. అయితే చలికి కాస్త బద్ధకంగా ఉంటుంది. అలాంటి సమయంలో ఈజీగా, ఫాస్ట్ గా అవ్వాలి. అలాంటప్పుడు సూప్ లు గుర్తొస్తాయి. బయటకు వెళ్లి అంతంత రేటు పెట్టే బదులు.. ఇంట్లోనే తయారు చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం..

Kitchen Tips: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ చికెన్ స్వీట్ కార్న్ సూప్.. ఇలా చేసుకోండి సూపర్ అంతే!!
Kitchen Tips
Chinni Enni
|

Updated on: Jul 30, 2023 | 12:04 PM

Share

వర్షాకాలంలో, శీతాకాలంలో వేడి వేడిగా ఏమాన్నా తినాలి, తాగాలి అనిపిస్తుంది. అయితే చలికి కాస్త బద్ధకంగా ఉంటుంది. అలాంటి సమయంలో ఈజీగా, ఫాస్ట్ గా అవ్వాలి. అలాంటప్పుడు సూప్ లు గుర్తొస్తాయి. బయటకు వెళ్లి అంతంత రేటు పెట్టే బదులు.. ఇంట్లోనే తయారు చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం.. టేస్టీకి టేస్ట్ ఉంటుంది.

ఎప్పుడూ కూరగాయలతో కాకుండా ఈ సారి చికెన్ స్వీట్ కార్న్ సూప్ ట్రై చేయండి. ఇది తయారు చేయడం కూడా ఈజీనే. జ్వరంగా, అనారోగ్యంతో ఉన్నప్పుడు వీటిని తాగుతూ ఉంటే ఉపశమనం లభిస్తుంది. మరి చికెన్ స్వీట్ కార్న్ సూప్ ని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేయు విధానం తెలుసుకుందాం.

సూప్ కి కావాల్సిన పదార్థాలు:

ఇవి కూడా చదవండి

1. చికెన్ (బోన్ ఆర్ బోన్ లెస్ చికెన్ ని తీసుకోవచ్చు) 2. క్యారెట్ 3. క్యాబేజ్ 4. స్వీట్ కార్న్ 5. పెప్పర్ పౌడర్ 6. చిల్లీ పౌడర్ 7. కార్న్ ఫ్లోర్ 8. ఉప్పు 9. మిరియాల పొడి 10. నూనె

తయారు చేయు విధానం:

1. ముందుగా పాన్ తీసుకొని అందులో కొద్దిగా నీరు, కొంచెం ఉప్పు, పసుపు వేసి చికెన్ వేసి 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఆతర్వాత నీరు వంపేసి పక్కన పెట్టుకోవాలి. 2. ఆ తర్వాత మరో సాస్ పాన్ తీసుకొని కొద్దిగా నూనె వేయాలి. నూనె వేడెక్కాక అందులో స్వీట్ కార్న్, సన్నగా తరిగిన క్యాబేజ్ మరియు క్యారెట్ ముక్కలు వేయాలి. 3. అవి బాగా వేగాక రెండు లీటర్ల నీళ్లు పోసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేయాలి. 4. ఇప్పుడు ఆ నీటిలో పెప్పర్ పౌడర్,చిల్లీ పౌడర్ వేయాలి. 5. 10 నిమిషాలు బాగా బాయిల్ అయ్యాక అందులో చికెన్ ముక్కలు వేసి మరో 5 నిమిషాలు ఉడకనివ్వాలి. 6. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో నీరు, కార్న్ ఫ్లోర్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఉండలు లేకుండా మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి. దీన్ని పా న్ లో వేసి, రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్స్ చేసుకోవాలి. 7. ఈ మొత్తాన్ని 10-15 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. అంతే హాట్ అండ్ స్పైసీ చికెన్ స్వీట్ కార్న్ సూప్ రెడీ.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..