Corona Virus: ముగింపు పలకని కరోనా.. ఇప్పటికీ వెంటాడుతున్న దీర్ఘకాలిక లక్షణాలు
2020లో వచ్చిన కరోనా ప్రపంచాన్ని ఎలా అతలాకుతలం చేసిందో అందిరికి తెలిసిందే. చాలా మందికి కొవిడ్ బారిన పడ్డారు. మరికొందరు దీనికి బలైపోయారు. ఇప్పటికీ కూడా కరోనా వైరస్ ప్రతిరోజూ ఎవరికో ఒకరికి సోకుతోంది. ఈ వైరస్ పూర్తిగా మనల్ని వదిలి వెళ్లలేదు.
2020లో వచ్చిన కరోనా ప్రపంచాన్ని ఎలా అతలాకుతలం చేసిందో అందిరికి తెలిసిందే. చాలా మందికి కొవిడ్ బారిన పడ్డారు. మరికొందరు దీనికి బలైపోయారు. ఇప్పటికీ కూడా కరోనా వైరస్ ప్రతిరోజూ ఎవరికో ఒకరికి సోకుతోంది. ఈ వైరస్ పూర్తిగా మనల్ని వదిలి వెళ్లలేదు. భవిష్యత్తులో ఇంకా కరోనా వేవ్‌లు వస్తాయా అనే ఆందోళన కూడా ఇంకా జనాలను వీడలేదు. అయితే గతంలో కోవిడ్ సోకిన వారు చాలా మంది దాని నుంచి కోలుకున్నారు. కానీ కొందరిలో మాత్రం దీర్ఘకాల దుష్ఫలితాలు కనిపిస్తున్నాయి. వారిలో పాత విషయాలు మర్చిపోవడం, మాట్లాడేటప్పుడు సరైన పదాలు నోట్లో ఆడక తడబడిపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. అలాగే వారిలో ఏకాగ్రత కూడా లోపిస్తోంది. ఇలాంటి లక్షణాలను లాంగ్ కోవిడ్‌గా వర్గీకరిస్తారు. కరోనా నుంచి కోలుకున్న రెండు సంవత్సరాల తర్వాత కూడా కొందరు ఈ లక్షణాల నుంచి బయటపడలేదు.
అయితే 2023 మార్చి నాటికి బ్రిటన్‌లో దాదాపు 10 లక్షల మంది లాంగ్ కొవిస్ బాధితులు ఏకాగ్రత లోపంతో బాధపడుతున్నట్లు తెలిసింది. మరికొందరిలో లాంగ్ కొవిడ్ కొంతకాలం పాటు ఉండి దైనందిక కార్యకలాపాలను సరిగా చేసుకోలేని పరిస్థితి కూడా ఏర్పడింది. మరికొంతమందిలో దీర్ఘలక్షణాలు కొనసాగి మానసిక కుంగుబాటుకు దారితీస్తున్నాయి. సాధారణంగా వయసు పెరిగే కొద్ది మానసిక శక్తి తగ్గిపోవడం సహజమే. కానీ ఒకవేళ లాంగ్ కోవిడ్ వయసు పెరగకుండానే వయసు పెరగకుండానే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి. లాంగ్ కోవిడ్ సుమారు మూడు నెలల కన్న ఎక్కువ ఉన్నవారిలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. అంతకంటే తక్కువ కాలం వ్యాధి బారినపడ్డవారు సాధారణ స్థితికి వచ్చేశారు. అయితే 3 నెలలకు మించి లాంగ్ కోవిడ్‌ను అనుభవించిన ప్రతి ఆరుగురిలో ఒకరికి మాత్రమే సాధారణ స్థితికి వచ్చారు.