AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fashion Tips: బట్టలు ఇలా సెట్ చేసుకోండి.. ట్రెండీగా, ఫ్యాషన్ గా ఉండండి!!

మన ఇంట్లో ఒక ఫంక్షన్ ఉందంటే.. ఎలా రెడీ అవ్వాలి? అందరికంటే మనమే బాగా కనిపించాలి అనుకుంటారు. ముఖ్యంగా లేడీస్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్ని బట్టలు ఉన్నా సరిపోదు. అయితే మీరు ఎప్పుడైనా బట్టలు కొనేముందు..

Fashion Tips: బట్టలు ఇలా సెట్ చేసుకోండి.. ట్రెండీగా, ఫ్యాషన్ గా ఉండండి!!
Fashion Tips
Chinni Enni
|

Updated on: Jul 30, 2023 | 11:52 AM

Share

బట్టలు ఎన్ని ఉన్నా.. కొత్తవి కనిపిస్తే కొనాలనిపిస్తుంది. ఇది సహజం. జంట్స్ అయినా లేడీస్ అయినా ఎవరికైనా ఇలా అనిపిస్తుంది. మన ఇంట్లో ఒక ఫంక్షన్ ఉందంటే.. ఎలా రెడీ అవ్వాలి? అందరికంటే మనమే బాగా కనిపించాలి అనుకుంటారు. ముఖ్యంగా లేడీస్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్ని బట్టలు ఉన్నా సరిపోదు. అయితే మీరు ఎప్పుడైనా బట్టలు కొనేముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ఆ టిప్స్ ఏంటో తెలుసుకుందామా.

*ఎలాంటివి కావాలి? ఎందుకు కొనాలనుకుంటున్నారు? అని ఓ లిస్ట్ రెడీ చేసుకోవాలి. ఏదైనా అకేషన్ కోసం కొనాలనుకుంటే వాటిని దృష్టిలో పెట్టుకోవాలి. అదే సాధారణమైన బట్టలు అయితే అన్నింటికి సూటయ్యే బట్టలు తీసుకోవాలి. అనవసరంగా బావున్నాయి కదా అని ఏది పడితే అవి తీసుకోకూడదు.

*బట్టలు కొనేముందు బాడీ స్ట్రక్చర్ ని బట్టి తీసుకోవాలి. ప్రతి ఒక్కరి శరీరాకృతిని బట్టి బట్టలు సెలకట్ట్ చేసుకోవాలి. మనకు ఏది సూట్ అవుతుంది? ఏ కలర్ లో బాగా కినిపిస్తామో.. అలాంటి వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి.

ఇవి కూడా చదవండి

*డ్రెస్ మాత్రం కరెక్ట్ గా ఉంటే కాదు.. వాటికి సరిపోయే యాక్సెసరీస్ కూడా వాడాలి. వీటి వల్ల మీ లుక్ మొత్తం మారిపోతుంది.

*అందరూ ఫాలో అయ్యేవి కాకుండా.. వెరైటీ ప్రింట్స్ ఉన్నవి ఎంచుకోవాలి. మంచి ప్రింట్స్ కూడా చూడ్డానికి అందంగా కనిపించడమే కాకుండా మీ డ్రెస్సింగ్‌ని ఎలివేట్ చేస్తాయి. అన్ని చోట్లా ఫ్యాషన్ కుదరదు కాబట్టి.. కొన్ని చోట్ల సాంప్రదాయంగా ఉన్న బట్టలు వేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు తీసుకున్నవి రెండు, మూడింటికి సెట్ అయ్యేవి తీసుకోవాలి.

*ఇక జీన్స్ అండ్ టీ షర్ట్స్ మాత్రం ఎప్పుడూ నెవర్ బోరింగ్ ఫ్యాషన్ అని చెప్పవచ్చు. ఇందులోనూ వైట్ అండ్ బ్లాక్ టీ షర్ట్స్, జీన్స్ ప్యాంట్స్ అయితే చాలా ఫ్యాషన్ గా ఉంటాయి.

ఇలా కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తూ ఉంటే.. అందంగా, ఫ్యాషన్ గా కనిపిస్తారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం..