- Telugu News Photo Gallery Beauty Tips in Telugu: Check out the easy tips about how to pedicure at home
Pedicure At Home: మీ పాదాల మెరుపు కోసం బ్యూటీ పార్లర్ ఎందుకు దండగ.. ఇంట్లోనే సింపుల్ చిట్కాలుండగా..
అందంగా కనిపించడం కోసం నేటి యువత ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. అయితే చాలామంది ముఖంపై పెట్టె శ్రద్ధ కాళ్లు, చేతుల మీద పెట్టరు. అదే సమయంలో కొంతమంది మాత్రం పాదాలు, చేతులు అందంగా కనిపించడానికి బ్యూటీ పార్లర్ ను ఆశ్రయిస్తారు. పెడిక్యూర్ తో వేలకు వేలు ఖర్చు చేస్తారు. అయితే ఇంట్లోనే సింపుల్ చిట్కాలతో పాదాలు అందంగా కనిపించేలా చేసుకోవచ్చు.
Updated on: Jul 30, 2023 | 12:40 PM

ఇంట్లో పాదాలు అందంగా కనిపించేలా చేసుకోవడానికి పార్లర్ కు వెళ్లాల్సిన అవసరం లేదు. మీ జేబును సేవ్ చేసుకుంటూనే ఇంట్లోనే పెడిక్యూర్ తోనే పాదాలను అందంగా చేసుకోండి. మొదట స్క్రబ్బింగ్ చేసిన తర్వాత మీ పాదాలను నీటితో శుభ్రం చేసుకోండి. ఫుట్ క్రీమ్ రాయండి. మెరిసే కాళ్లు రెడీ.

చాలా మంది తమ ముఖాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు. అయితే చేతులు, కాళ్ళను నిర్లక్ష్యం చేస్తారు. ఫలితంగా కొంత కాలం తరువాత పాదాలు టాన్ తో పగుళ్లతో అందవిహీనంగా మారతాయి. అప్పుడు పెడిక్యూర్ చేయించుకోవడానికి బ్యూటీ పార్లర్ కి పరుగెత్తుతారు. చాలా డబ్బు ఖర్చవుతుంది. డబ్బు మాత్రమే కాదు, కొన్నిసార్లు ఫలితం ఆశించినంతగా ఉండదు

వాస్తవానికి పెడిక్యూర్ ఇంట్లోనే చేసుకోవచ్చనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. మెరిసే పాదాల కోసం ఇంటి చిట్కాలను అనుసరించండి. ఒక పెద్ద గిన్నెలో గోరువెచ్చని నీటిని తీసుకోండి. ఇప్పుడు ఆ నీటిలో కొంచెం బాత్ సాల్ట్ లేదా పెడిక్యూర్ సాల్ట్ వేయండి. అనంతరం కొన్ని చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ ను జోడించండి.

ఇప్పుడు మీ పాదాలకు తేలికపాటి సబ్బును పూయండి. మీ పాదాలను గోరువెచ్చని నీటిలో 20 నిమిషాలు నానబెట్టండి. తర్వాత నీటి నుంచి పాదాలను తీసి స్క్రబ్బర్ స్టోన్ తో పాదాలను సున్నితంగా రుద్దుతూ శుభ్రం చేయండి.

అనంతరం పాదాలను తడి లేకుండా ఆరబెట్టి, ఫుట్ స్క్రబ్‌ని అప్లై చేయండి. అయితే ఈ స్క్రబ్‌లను ఇంట్లోనే తయారు చేసుకోండి..

శనగపిండి, బియ్యప్పిండి, నిమ్మరసం, కొంచెం పంచదార కలిపి పేస్టులా చేసుకొండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్క్రబ్ లా అప్లై చేయండి.

స్క్రబ్బింగ్ చేసిన తర్వాత, మీ పాదాలను నీటితో శుభ్రం చేసుకోండి. ఫుట్ క్రీమ్ రాయండి. ఇలా చేయడం వలన మెరిసే కాళ్లు మీ సొంతం. కనుక పెడిక్యూర్ చేయించుకోవడానికి పార్లర్‌కి పరుగెత్తాల్సిన అవసరం ఏర్పడదు.





























