- Telugu News Photo Gallery Cinema photos Sonu Sood Birthday 2023: Interesting facts about actor Sonu Sood's Incredible Journey
Sonu Sood: ‘వదల బొమ్మాళీ..’ అంటూ భయపెట్టిన సోనూ సూద్ జీవితంలో అంతులేని విషాదం!
సొంత లాభం కొంత మానుకో, పొరుగు వాడికి సాయపడవోయ్.. దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్’ అన్న గురజాడ మాటలను ఆచరణలో పెట్టిన నటుడు సోనూసూద్. తెరపై 'వదలను బొమ్మాళీ..' అంటూ వెన్నులో వణుకు పుట్టించిన ఈ టాలీవుడ్ విలన్ నిజజీవితంలో మాత్రం ఎందరికో ఆపన్నహస్తం అందించి రియల్ హీరోగా మెప్పుపొందాడు. ఈ రోజు సోనూసూద్ 50వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సోనూసూద్ గురించిన కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం....
Updated on: Jul 30, 2023 | 11:09 AM

సొంత లాభం కొంత మానుకో, పొరుగు వాడికి సాయపడవోయ్.. దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్’ అన్న గురజాడ మాటలను ఆచరణలో పెట్టిన నటుడు సోనూసూద్. తెరపై 'వదలను బొమ్మాళీ..' అంటూ వెన్నులో వణుకు పుట్టించిన ఈ టాలీవుడ్ విలన్ నిజజీవితంలో మాత్రం ఎందరికో ఆపన్నహస్తం అందించి రియల్ హీరోగా మెప్పుపొందాడు. ఈ రోజు సోనూసూద్ 50వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సోనూసూద్ గురించిన కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం..

సోనూ సూద్ పంజాబ్‌లోని మోగాలో 1973, జులై 30న జన్మించారు. సోనూ అమ్మగారు ప్రొఫెసర్.. నాన్న బట్టల వ్యాపారి. వాల్ల బట్టల షాప్ ఎదుట వారానికోసారి అన్నదానం చేస్తుంటారు.సాయపడటంలో ఉండే ఆనందం చిన్నతనం నుంచే తెలుసుకున్న సోనూ పాఠశాల స్థాయి నుంచే ఇతరులకు సాయపడటం ప్రారంభించాడు.

ముఖ్యంగా కరోనా సమయంలో లాక్‌డౌన్ కారణంగా ఎందరో అభాగ్యులు ఆకలితో అలమటించారు. స్నేహితులతో కలిసి ఎంతో మంది ఆకలి తీర్చడంతోపాటు కాలినడకన వేల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తున్న వారిని బస్సుల్లో సొంత ఊర్లకు చేర్చాడు.

సోషల్ మీడియాలోనూ 'సాయం కావాలి..' అంటూ ట్వీట్ చేస్తే రెక్కలు కట్టుకుని మరీ వెళ్లి నేనున్నానంటూ సాయపడే సోనూ విశాల హృదయం ముందు ఆకాశం కూడా చిన్నదే. ఈ సాయం చేసే గుణమే నటుడిగా కొందరికే తెలిసిన సోనూసూద్ పేరు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మారుమ్రోగి పోతోంది.

ఇంజనీరింగ్ చదివిన సోనూసూద్ మోడలింగ్‌పై ఆసక్తితో రంగుల ప్రపంచంలోకి వచ్చాడు. ఆ తర్వాత కల్లాజగర్ అనే తమిళ మువీతో తెరంగెట్రం చేశాడు. హ్యాండ్సప్ మువీతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. అమ్మాయిలు.. అబ్బాయిలు, సూపర్, అతడు, అశోక్, మిస్టర్ మేథావి, అరుంధతి, ఆంజనేయులు, బంగారు బాబు, ఏక్ నిరంజన్, శక్తి, తీన్‌మార్, కందిరీగ, దూకుడు, ఊ కొడతారా? ఉలిక్కి పడతారా?, జులాయి, భాయ్, ఆగడు వంటి పలు తెలుగు మువల్లో విలక్షణమైన పాత్రలు పోషించాడు. ‘అరుంధతి’లో సోనూ పోషించిన పసుపతి పాత్రకి ఉత్తమ విలన్‌గా నంది అవార్డుని తెచ్చిపెట్టింది.

సోనూ లైఫ్ పార్ట్నర్ సోనాలి. వీరిద్దరికీ ఇద్దరు అబ్బాయిలు సంతానం. నటుడిగా కెరీర్ ప్రారంభించకముందే సోనూ తల్లి మరణించారు. నాలుగేళ్ల క్రితం తండ్రి కూడా కాలం చేశారు. సోనూ జీవితంలో తల్లిదండ్రుల మరణాలు మరచిపోలేని విషాదాలుగా మిగిలిపోయాయి. అన్నట్టూ.. సోనూకి వ్యాయామం అంటే మహా ఇష్టం. రోజులో రెండు గంటలు వ్యాయామానికే కేటాయిస్తాడట.




