Dentist of Crocodile: మొసలి నోట్లోకి వెళ్లినా ప్రాణాలతో తిరిగి వచ్చే ఏకైక ప్రాణి అదొక్కటే.. స్నేహమే కారణం..
Crocodile Dentist: మరి జంతువులకు దంతాల సమస్య వస్తే? వాటి సమస్యకు పరిష్కారం ఏంటి? వాటికి చికిత్స ఎవరు చేస్తారు? మిగతా జంతువుల సంగతి ఏమో కానీ.. మొసలికి మాత్రం తన వద్దకే వచ్చి పరీక్షించే దంత వైద్యుడు ఉన్నాడు. అది కూడా ప్రకృతి ప్రసాదించిన దంత వైద్యుడే. అవును, మొసలికి ఓ పక్షి దంత వైద్యుడిగా పని చేస్తుంది. అదెలాగంటారా? అయితే, ఈ స్టోరీ చదవాల్సిందే.
Viral: మనకు దంతాలలో ఏదైనా సమస్య వస్తే వెంటనే దంత వైద్యుడి దగ్గరకు వెళతాం. తమ సమస్యను వైద్యుడికి తెలియజేసి, అవసరమైన చికిత్స తీసుకుంటాం. తద్వారా మనం రిలీఫ్ పొందుతాం. ఇది మనుషుల దంత సమస్యలకు ఉన్న మార్గం. మరి జంతువులకు దంతాల సమస్య వస్తే? వాటి సమస్యకు పరిష్కారం ఏంటి? వాటికి చికిత్స ఎవరు చేస్తారు? మిగతా జంతువుల సంగతి ఏమో కానీ.. మొసలికి మాత్రం తన వద్దకే వచ్చి పరీక్షించే దంత వైద్యుడు ఉన్నాడు. అది కూడా ప్రకృతి ప్రసాదించిన దంత వైద్యుడే. అవును, మొసలికి ఓ పక్షి దంత వైద్యుడిగా పని చేస్తుంది. అదెలాగంటారా? అయితే, ఈ స్టోరీ చదవాల్సిందే.
ప్లోవర్ అనే పక్షి.. మొసలికి దంత వైద్యుడిగా పని చేస్తుంది. ఈ ప్లోవర్ మొసలి దంతాలను శుభ్రం చేస్తుంటుంది. ఏమాత్రం భయం లేకుండా మొసలి నోటికి నేరుగా వెళ్లి దంతాల నుంచి మురికిని తొలగిస్తుంది. మొసలి దంతాల మధ్య ఇరుక్కుపోయిన మాంసాన్ని, ఇతర ఆహారాన్ని తినడం ద్వారా అటు దాని దంతాలను క్లీన్ చేసినట్లు అవుతుంది. ఇటు తన ఆకలి కూడా తీరుతుంది. అదన్నమాట. ఈ డెంటిస్ట్ సీక్రెట్.
నోట్లోకి వెళ్లినా తిరిగి వస్తుంది..
సాధారణంగా మొసలికి ఏదైనా జీవి చిక్కిందంటే.. అదే దాని చివరి రోజు అని చెప్పొచ్చు. కానీ, ఈ ప్లోవర్ విషయంలో మాత్రం సీన్ రివర్సే. ఈ పక్షి మొసలి నోటి లోపలికి ప్రవేశిస్తుంది. లోపలి దంతాలను సైతం శుభ్రం చేస్తుంది. మళ్లీ హాయిగా తిరిగి వస్తుంది. మొసలి ఈ ప్లోవర్ పక్షికి ఎలాంటి హానీ తలపెట్టదు. ఎందుకంటే.. తన దంతాలను క్లీన్ చేస్తుందనే కృతజ్ఞతా భావం.
మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..