Health Tips: అమ్మో బీట్ రూట్ ఇన్ని చేస్తుందా.. మీరు మిస్ చేసుకోకండి!!
బీట్ రూట్ ఓన్నో పోషకాలకు నిధి. బీట్ రూట్ నుంచి ఒక లాంటి వాసన వస్తుందని చాలా మంది తినడానికి ఆసక్తి చూపించరు. కానీ బీట్ రూట్ లో ఎన్నో పోషకాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ అధికంగా ఉంటాయి. బీట్ రూట్ లో నైట్రేట్లు ఎక్కువ మొత్తంలో..

బీట్ రూట్ ఓన్నో పోషకాలకు నిధి. బీట్ రూట్ నుంచి ఒక లాంటి వాసన వస్తుందని చాలా మంది తినడానికి ఆసక్తి చూపించరు. కానీ బీట్ రూట్ లో ఎన్నో పోషకాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ అధికంగా ఉంటాయి. బీట్ రూట్ లో నైట్రేట్లు ఎక్కువ మొత్తంలో లభిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్ కూడా కలిగి ఉంటుంది. ఇందులో అయాన్లు, ఫైబర్, సహజ చక్కెరలు, మెగ్నీషియం, సోడియం, పొటాషియం మెండుగా ఉంటాయి. బీట్ రూట్ ను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
-రోజూ ఖాళీ కడుపుతో బీట్ రూట్ ను తీసుకుంటే.. దీని ప్రభావం కొద్ది రోజుల్లోనే కనిపించడం ప్రారంభమవుతుంది.
-బరువు పెరగడం, పొట్ట, నడుము కొవ్వుతో ఇబ్బంది పడేవారు ఉదయాన్నే బీట్ రూట్ తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.




-బీట్ రూట్ లో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. చాలా మంది ఆరోగ్య నిపుణులు ఉదయం నిద్రలేచిన తర్వాత ఖాళీ కడుపుతో తినాలని సిఫార్సు చేస్తున్నారు.
– పిల్లలు రోజూ ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్ తాగితే జ్ఞాపకశక్తి పెరుగుతుందని ఆహార నిపుణులు తెలుపుతున్నారు
-గర్భిణీలు రోజూ ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్ తాగితే కడుపులో బిడ్డ ఎదుగుదలకు అవసరమయ్యే ఫోలిక్ యాసిడ్ అందుతుందట. బిడ్డ కూడా ఎంతో ఆరోగ్యంగా పుడుతుందట.
-బీట్ రూట్ జ్యూస్ ను రోజూ తాగితే హైబీపీ తదితర సమస్యలు దూరమవుతాయి. ఎముకల్ని దృఢంగా ఉంచే శక్తి కూడా బీట్ రూట్ కు ఉంది.
-బీట్ రూట్ వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి కూడా పెరుగుతుంది. కాలేయం శుభ్రం కావడానికి కూడా బీట్ రూట్ ఎంతో ఉపయోగపడుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం..