Health Tips: మీరు 9 గంటల కంటే ఎక్కువ సేపు పనిచేస్తున్నారా? అయితే ఇది మీకోసమే!
సాధారణంగా పురుషుల్లో 40 నుంచి 50 ఏళ్ల వారికి ఊబకాయం ఎక్కువగా వస్తుంది. అదే మహిళలకి అయితే పదేళ్ల తర్వాత అంటే 50 నుంచి 60 ఏళ్లలో వస్తుంది. ఇక స్థూలకాయం మహిళల్లో ఇది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే హర్మోన్ల చక్రాన్ని బట్టి కొవ్వు పంపిణీ మారుతుంది. ఊబకాయం అనే సమస్య మగ, ఆడవారిలో..

సాధారణంగా పురుషుల్లో 40 నుంచి 50 ఏళ్ల వారికి ఊబకాయం ఎక్కువగా వస్తుంది. అదే మహిళలకి అయితే పదేళ్ల తర్వాత అంటే 50 నుంచి 60 ఏళ్లలో వస్తుంది. ఇక స్థూలకాయం మహిళల్లో ఇది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే హర్మోన్ల చక్రాన్ని బట్టి కొవ్వు పంపిణీ మారుతుంది. ఊబకాయం అనే సమస్య మగ, ఆడవారిలో వేర్వేరుగా ఉంటుంది. అదే విధంగా ఎక్కువ సమయం పని చేసినా కూడా ఈ సమస్య ముందుగానే వస్తుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.
కొరియా, హాంకాంగ్, ఆస్ట్రేలియా, ఫిన్లాండ్ వంటి దేశాలు ఎక్కువ పని గంటలు, అధిక బరువు సమస్య మధ్య సంబంధం ఉన్నట్లు ఆ అధ్యయనాలు చెబుతున్నాయి. ఎక్కువ సేపు పని చేయడం అనేది నిద్ర సమయాన్ని ప్రభావితం చేస్తుందట. ఇక్కడ జరిగిన అధ్యయనాలు మగవారు అధిక బరువు ఎక్కువ పని గంటలు, ఆడవారి ఊబకాయంపై అసంపూర్ణ ప్రభావాలను చూపిస్తున్నాయని అంటున్నారు.
ప్రతి రోజు కూడా తొమ్మిది గంటల కంటే ఎక్కువ పని చేసే స్త్రీలు అధిక బరువుతో బాధపడుతున్నారు. కానీ పురుషుల్లో మాత్రం బరువుపై ఎలాంటి ప్రభావం చూపడం లేదు. రోజుకు 9 గంటల కంటే తక్కువ పని చేసే 50 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న మహిళలతో పోలిస్తే ఎక్కువ వయసు ఉన్నవారు, ఎక్కువ గంటలు పనిచేసిన వారు అధిక బరువుతో బాధపడుతున్నట్లు అధ్యయనాలు వెల్లడించాయి.




మొత్తానికి 50 ఏళ్లు పైబడిన స్త్రీలు ఎక్కువ సేపు వర్క్ చేయడం వల్ల బరువు పెరుగుతారు. శారీరక శ్రమ తగ్గడం, పనిచేయకపోవడం వల్ల మెనోపాజ్ కి చేరుకునే స్త్రీల బరువు పెరుగుతుంది. స్థూలకాయం లిపిడ్ స్థాయిలను పెంచుతుందన్నారు. 9 గంటల కంటే ఎక్కువ పని చేయడం, ఒత్తిడి, సరిలేని జీవనం హార్మోన్ లెఫ్టిన్స్ ని తగ్గిస్తాయి. దీని వల్ల అధిక బరువు పెరుగుతారు. ఎక్కువ సేపు పని చేయడం వల్ల జీవక్రియ సరిగ్గా ఉండదు. దీనివల్ల బరువు పెరుగుతారు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం..




