- Telugu News Photo Gallery These are the indications of Fiber deficiency in your body, add these foods to overcome the problem
Health Tips: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? తస్మాత్ జాగ్రత్త.. అప్రమత్తం కాకుంటే ఇక అంతే సంగతి..
Health Tips: సంపూర్ణ ఆరోగ్యం కోసం శరీరానికి కావాలసిన ఆన్ని రకాల పోషకాలను ఆహారంలో భాగంగా తీసుకున్నప్పుడే సాధ్యం అవుతుంది. ఈ క్రమంలో ఏ ఒక్క పోషకం శరీరానికి అందకపోయినా.. పోషకాహార లోపం సమస్య ఎదురవుతుంది.
Updated on: Jul 30, 2023 | 4:36 PM

శరీరానికి అవసరమైన ప్రధాన పోషకాలలో ఫైబర్ కూడా ఒకటి. ఈ ఫైబర్ మీ ఆరోగ్య రక్షణలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అలాగే శరీరంలో ఫైబర్ లోపం ఏర్పడితే మీరు కొన్ని రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. ఈ క్రమంలో శీరరంలో ఫైబర్ లోపించిందని ముందుగానే తెలుసుకొని దాన్ని అధిగమించవచ్చు. మరి ఫైబర్ లోపం ఏర్పడిందని ఎలా గుర్తించవచ్చో ఇప్పుడు చూద్దాం..

మలబద్ధకం: శరీరంలో ఫైబర్ లోపం ఉన్నట్లయితే మీకు ముందుగా కనిపించే లక్షణం మలబద్ధకం. ఈ లక్షణం మీలో కనిపిస్తే వెంటనే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. లేకుంటే శరీరంలోని వ్యర్ధాలు శరీర భాగాలకు చేరి రానున్న కాలంలో ప్రాణాంతకంగా మారగలవు.

అధిక బరువు: ఉన్నపాటిగా బరువు పెరగడం, శరీర భాగాల్లో కొవ్వు పేరుకుపోయినట్లు అనిపిస్తే మీ శరీరంలో ఫైబర్ లోపం ఉందని అర్థం. వెంటనే అప్రమత్తమై ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోకుంటే ఊభకాయంతో బాధపడాల్సిందే.

అలసట: కొద్ది పాటి శ్రమకే మీరు ఆలసిపోతే మీ శరీరంలో ఫైబర్ లేదని, శరీరానికి వెంటనే అది కావాలని అర్థం.

బ్లడ్ షుగర్: మీ రక్తంలో షుగర్ లెవెల్స్ ఉన్నపాటిగా పెరుగుతుంటే దానికి కూడా ఫైబర్ లోపమే కారణం.

అయితే మీరు ఫైబర్ లోపాన్ని అధిగమించేందుకు బాదం, చియా గింజలు, జామకాయ, పచ్చి బఠానీలు, అరటి పండు, కొబ్బరి, నారింట, క్యారెట్, దానిమ్మ, స్వీట్ పొటాటో, ఆపిల్, అంజీర్, వంకాయ, ఉల్లిపాయ, బొప్పాయి వంటి ఆహారాలను నిత్యం తీసుకోవాలి.




