- Telugu News Photo Gallery Cricket photos IND vs WI 2nd ODI: Shubman Gill Breaks Babar Azam's unique Record in ODI Cricket
Shubman Gill: గిల్ ఖాతాలో రోహిత్, కోహ్లీకే సాధ్యం కాని అరుదైన రికార్డ్.. బాబర్ అజామ్‌ని అధిగమించి..
IND vs WI 2nd ODI: భారత్, వెస్టిండీస్ మధ్య బర్బడోస్ వేదికగా జరిగిన రెండో వన్డేలో కరేబియన్లు టీమిండియాపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించారు. అయితే ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున ఓపెనర్‌గా వచ్చిన శుభమాన్ గిల్ ఓ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. అంతేకాక పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజమ్ రికార్డ్‌ను బద్దలుకొట్టాడు.
Updated on: Jul 30, 2023 | 4:41 PM

Shubman Gill: వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో ప్రిన్స్ శుభమాన్ గిల్ 34 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ ద్వారా తన 26వ వన్డే ఆడిన శుభమాన్.. వన్డే క్రికెట్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఇతర అనుభవజ్ఞులైన టీమిండియా ప్లేయర్లు సాధించలేని ఘనత సాధించాడు.

తొలి 26 వన్డేల్లోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఇన్నాళ్లు కొనసాగుతున్న బాబర్ అజామ్‌ని టీమిండియా ప్రిన్స్ శుభమాన్ అధిగమించాడు.

26 వన్డేల అనుభవంలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా బాబర్ అజామ్ అగ్రస్థానంలో ఉండేవాడు. పాక్ కెప్టెన్ బాబర్ తన తొలి 26 వన్డేల్లో 1322 పరుగులు చేశాడు.

అయితే శుభమాన్ తన తొలి 26 వన్డేల్లోనే 1352 పరుగులు చేసి బాబర్ రికార్డ్‌ను బద్దలు కొట్టాడు. తద్వారా 26 వన్డేల అనుభవంలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ప్రిన్స్ అవతరించాడు.

కాగా, శనివారం జరిగిన రెండో వన్డేలో భారత్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి అనుభవజ్ఞులు లేకుండానే బరిలోకి దిగడంతో ఓటమిపాలైంది. అందిందే అవకాశం అన్నట్లుగా రెచ్చిపోయిన వెస్టిండీస్ ప్లేయర్లు భారత్‌పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించారు. దీంతో 3 వన్డేల సిరీస్ 1-1 తేడాతో సమం అయింది.




