- Telugu News Photo Gallery Cricket photos Australia player David Warner involved in most 100 run opening partnerships record in Tests
Ashes 2023: సరికొత్త ప్రపంచ రికార్డ్ సృష్టించిన వార్నర్ మామా.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా..
David Warner Records: మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో జరుగుతున్న యాషెస్ సిరీస్ చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్లు అద్భుత బ్యాటింగ్‌ను ప్రదర్శించారు. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ నిర్దేశించిన 384 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగింది.
Updated on: Jul 31, 2023 | 5:00 AM

Ashes 2023: మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో జరుగుతున్న యాషెస్ సిరీస్ చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్లు అద్భుత బ్యాటింగ్‌ను ప్రదర్శించారు. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ నిర్దేశించిన 384 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా జట్టులో డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా సెంచరీలతో భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

38 ఓవర్లు ముగిసే సరికి వార్నర్-ఖ్వాజా జోడీ తొలి వికెట్‌కు 135 పరుగులు చేసి ఆస్ట్రేలియా జట్టుకు శుభారంభాన్ని అందించింది. ఈ సెంచరీ భాగస్వామ్యంతో డేవిడ్ వార్నర్ టెస్టు క్రికెట్‌లో సరికొత్త ప్రపంచ రికార్డును కూడా సృష్టించాడు.

ఉస్మాన్ ఖవాజాతో కలిసి 100 పరుగులు చేయడం ద్వారా టెస్టు క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు బాదిన ఓపెనర్‌గా డేవిడ్ వార్నర్ ప్రపంచ రికార్డును పంచుకున్నాడు.

గతంలో ఈ రికార్డు జాక్ హాబ్స్ (ఇంగ్లండ్), గ్రేమ్ స్మిత్ (దక్షిణాఫ్రికా), అలిస్టర్ కుక్ (ఇంగ్లండ్) పేరిట ఉంది. ఈ ముగ్గురు ఓపెనర్లు టెస్టు క్రికెట్‌లో 24 సెంచరీల భాగస్వామ్యాల రికార్డు సృష్టించారు.

డేవిడ్ వార్నర్ ఇప్పుడు తన 25వ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి సరికొత్త చరిత్ర సృష్టించాడు. దీంతో టెస్టు క్రికెట్‌లో అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు సాధించిన ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా డేవిడ్ వార్నర్ ప్రపంచ రికార్డు సృష్టించాడు.




