- Telugu News Photo Gallery Cricket photos IND vs WI 2nd ODI Team india young player Shubman Gill Breaks Babar Azam's World Record
IND vs WI: బాబర్ రికార్డుకు ఇచ్చిపడేసిన టీమిండియా ఫ్యూచర్ స్టార్.. ఆ లిస్టులో ప్రపంచ నంబర్ వన్ మనోడే..
IND vs WI: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకపోవడంతో వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఓటమి పాలైంది. వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో టీమిండియాపై విజయం సాధించింది. టీమిండియా 40.5 ఓవర్లలో 181 పరుగులకే పరిమితమైంది.
Updated on: Jul 31, 2023 | 5:30 AM

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకపోవడంతో వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఓటమి పాలైంది. వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో టీమిండియాపై విజయం సాధించింది. టీమిండియా 40.5 ఓవర్లలో 181 పరుగులకే పరిమితమైంది. అనంతరం బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 36.4 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది.

ఈ విజయంతో విండీస్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. శుభారంభం తర్వాత టీమిండియా బ్యాట్స్‌మెన్ పేలవ ప్రదర్శన చేయడం ఓటమికి దారి తీసింది. ఓపెనింగ్ జోడీ ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్ 90 పరుగుల భాగస్వామ్యంతో జట్టుకు శుభారంభం అందించినా మిగిలిన ఆటగాళ్లు దానిని కొనసాగించలేదు.

ఈ మ్యాచ్‌లో 49 బంతులు ఎదుర్కొన్న శుభ్‌మన్ గిల్ 5 బౌండరీల సాయంతో 39 పరుగులు చేశాడు. అలాగే ఇదే మ్యాచ్‌లో గిల్ 34 పరుగులతో వన్డేల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఇతర అనుభవజ్ఞులైన ఆటగాళ్లు చేయలేని రికార్డును సృష్టించాడు.

వన్డే క్రికెట్‌లోని మొదటి 26 ఇన్నింగ్స్‌లలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్ అగ్రస్థానంలో ఉన్నాడు. అయితే ఇప్పుడు ఈ రికార్డును గిల్ బద్దలు కొట్టి మొదటి స్థానాన్ని ఆక్రమించాడు.

2019లో వన్డేల్లో అరంగేట్రం చేసిన శుభ్‌మన్ 26 ఇన్నింగ్స్‌ల్లో 1352 పరుగులు చేశాడు. 61.45 సగటుతో పరుగులు చేసిన గిల్ 1 డబుల్ సెంచరీ, 4 సెంచరీలు, 5 అర్ధసెంచరీలు చేశాడు. శుభ్‌మన్ కంటే ముందు ఈ రికార్డును లిఖించిన ఆటగాళ్లను ఓసారి చూద్దాం..

శుభ్‌మన్ గిల్- 26 ఇన్నింగ్స్‌లు, 1352 పరుగులు

బాబర్ ఆజం- 26 ఇన్నింగ్స్‌లు, 1322 పరుగులు

జోనాథన్ ట్రాట్- 26 ఇన్నింగ్స్‌లు, 1303 పరుగులు

ఫఖర్ జమాన్- 26 ఇన్నింగ్స్‌లు, 1275 పరుగులు

రోసీ వాన్ డెర్ డస్సెన్- 26 ఇన్నింగ్స్‌లు, 1267 పరుగులు




