- Telugu News Photo Gallery Cricket photos Ishan Kishan break Sachin Tendulkar record and Equals MS Dhoni's Record in IND vs WI 2nd ODI
IND vs WI: విండీస్‌లో 2 ఇన్నింగ్స్‌లు.. కట్‌చేస్తే.. అటు సచిన్, ఇటు ధోని రికార్డులను మడతపెట్టేసిన యంగ్ ప్లేయర్..
India vs West Indies 2nd ODI: కరీబియన్ దీవుల్లో ఇషాన్ కిషన్ అద్భుత ఫామ్ కొనసాగుతోంది. టెస్టు సిరీస్ తర్వాత వన్డే సిరీస్‌లోనూ కిషన్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. తొలి వన్డేలో 52 పరుగులు చేసిన కిషన్.. రెండో మ్యాచ్‌లోనూ హాఫ్ సెంచరీతో 55 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ అద్భుత హాఫ్ సెంచరీతో సరికొత్త రికార్డు సృష్టించాడు. భారత క్రికెట్ జట్టు మాజీ వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ ఎంఎస్ ధోని రికార్డును కిషన్ సమం చేశాడు.
Updated on: Jul 31, 2023 | 8:36 AM

Ishan Kishan Record: కరీబియన్ దీవుల్లో ఇషాన్ కిషన్ అద్భుత ఫామ్ కొనసాగుతోంది. టెస్టు సిరీస్ తర్వాత వన్డే సిరీస్‌లోనూ కిషన్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. తొలి వన్డేలో 52 పరుగులు చేసిన కిషన్.. రెండో మ్యాచ్‌లోనూ హాఫ్ సెంచరీతో 55 పరుగులు చేశాడు.

రెండో వన్డేలో భారత్ 181 పరుగులకే ఆలౌట్ అయింది. ఇందులో ఇషాన్ కిషన్ అత్యధిక పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. గిల్‌తో కలిసి శుభ్‌మన్ 90 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. కిషన్ బ్యాట్‌లో ఆరు ఫోర్లు, 1 సిక్స్ వచ్చాయి.

ఈ క్రమంలో కిషన్ హాఫ్ సెంచరీతో సరికొత్త రికార్డు సృష్టించాడు. భారత క్రికెట్ జట్టు మాజీ వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ ఎంఎస్ ధోని రికార్డును కిషన్ సమం చేశాడు.

కరేబియన్ గడ్డలో వెస్టిండీస్‌పై రెండు బ్యాక్‌టు బ్యాక్ వన్డే హాఫ్ సెంచరీలు సాధించిన రెండో భారత వికెట్ కీపర్‌గా కిషన్ నిలిచాడు. 2017లో భారత్ వెస్టిండీస్ పర్యటన సందర్భంగా ధోనీ ఈ ఘనత సాధించాడు.

ఆ తర్వాత నార్త్ సౌండ్‌లో జరిగిన మూడో వన్డేలో ధోనీ 79 బంతుల్లో 78 పరుగులు, నాలుగో వన్డేలో 114 బంతుల్లో 54 పరుగులు చేశాడు. ఇప్పుడు అతని రికార్డును కిషన్ సమం చేశాడు.

దీంతో పాటు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా ఇషాన్ బద్దలు కొట్టాడు. ఐదు ఇన్నింగ్స్‌ల తర్వాత, ఓపెనర్‌గా బ్యాట్స్‌మన్ చేసిన అత్యధిక పరుగుల జాబితాలో కిషన్ అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఓపెనర్‌గా సచిన్ తొలి ఐదు ఇన్నింగ్స్‌ల్లో 321 పరుగులు చేశాడు. ప్రస్తుతం కిషన్ 348 పరుగులు చేశాడు.

రెండో వన్డేలో భారత్ పేలవ ఆటతీరుతో ఓటమి పాలైంది. భారత్ నిర్దేశించిన 182 పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్ 36.4 ఓవర్లలో 6 వికెట్ల తేడాతో ఛేదించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో 1-1 ఆధిక్యంలో నిలిచింది.




