AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Blood Purify Tips: వీటితో శరీరంలోని రక్తం సహజంగా క్లీన్ అవుతుంది.. ఫేస్ గ్లో కూడా పెరుగుతుంది..

Blood Purify Tips: రక్తం శుభ్రంగా ఉంటేనే.. ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు. ఏదైనా అనారోగ్య సమస్య వస్తే అందుకు మొదటి కారణం బ్లడ్ ఇన్‌ఫెక్షన్ ఉంటుంది. రక్తంలో కలుషితం కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో పాటు.. ముఖంపై మొటిమలు కూడా వస్తాయి. ఈ సమస్య తగ్గడానికి మెడిసిన్స్ వాడుతారు. మరి ఈ సమస్య నుంచి బయటపడేందుకు మెడిసిన్స్ మాత్రమే కాకుండా.. సహజ పద్ధతులు కూడా ఉన్నాయి. ఇంట్లో అందుబాటులో ఉండే పదార్థాలతోనే రక్తాన్ని

Blood Purify Tips: వీటితో శరీరంలోని రక్తం సహజంగా క్లీన్ అవుతుంది.. ఫేస్ గ్లో కూడా పెరుగుతుంది..
Blood Purifying
Shiva Prajapati
|

Updated on: Jul 30, 2023 | 2:10 PM

Share

Blood Purify Tips: వ్యక్తి శరీరంలో రక్తం కీలక పాత్ర పోషిస్తుంది. శరీర భాగాలకు ఆక్సీజన్, పోషకాలను చేరవేస్తుంది. ఆ రక్తమే తగ్గితే అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. అలాగే రక్తం కలుషితమైతే, ఇన్‌ఫెక్షన్స్ పెరిగినా.. ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. రక్త సంబంధిత సమస్యలతో ఎంతో మంది ప్రాణాలను కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. రక్తం శుభ్రంగా ఉంటేనే.. ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు. ఏదైనా అనారోగ్య సమస్య వస్తే అందుకు మొదటి కారణం బ్లడ్ ఇన్‌ఫెక్షన్ ఉంటుంది. రక్తంలో కలుషితం కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో పాటు.. ముఖంపై మొటిమలు కూడా వస్తాయి. ఈ సమస్య తగ్గడానికి మెడిసిన్స్ వాడుతారు. మరి ఈ సమస్య నుంచి బయటపడేందుకు మెడిసిన్స్ మాత్రమే కాకుండా.. సహజ పద్ధతులు కూడా ఉన్నాయి. ఇంట్లో అందుబాటులో ఉండే పదార్థాలతోనే రక్తాన్ని శుభ్రం అవుతుంది. మరి అవేంటో ఇవాళ మనం తెలుసుకుందాం..

రక్తాన్ని శుద్ధి చేసే మార్గాలు..

1. వేప ఆకులు: ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి రక్తంలో పేరుకుపోయిన టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో సహాయపడతాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో 4 నుండి 5 వేప ఆకులను నమలడం ద్వారా రక్తం శుభ్రమవుతుంది.

ఇవి కూడా చదవండి

2. బెల్లం: బెల్లం కూడా రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. బెల్లం ఎంత పాతదైతే.. అంత స్వచ్ఛంగా ఉంటుంది. అందుకే పాత బెల్లాన్ని తినేందుకు ప్రాధాన్యత ఇవ్వండి.

3. పసుపు: పసుపు కూడా రక్తాన్ని శుభ్రం చేస్తుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ బయాటిక్ లక్షణాలు.. రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతాయి.

4. తులసి: దగ్గు, జలుబు నయం చేయడంలో తులసి ఆకు అద్భుతంగా పని చేస్తుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రోజూ ఉదయం 5 నుంచి 6 ఆరు తులసి ఆకులను నమలవచ్చు. టీలో తులసి ఆకులను వేసి కూడా తీసుకోవచ్చు.

5. యాపిల్ సైడర్ వెనిగర్: ఇది కూడా శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపిస్తుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఆపిల్ సైడర్ వెనిగర్‌ను తీసుకోవాలి.

6. వెల్లుల్లి: ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. అంతేకాదు.. ఇది రక్తాన్ని శుభ్రం చేస్తుంది. వెల్లుల్లి రెబ్బలను తినడం వలన ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి.

గమనిక: పైన పేర్కొన్న సమాచారం ఆరోగ్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు. ఏవైనా అనారోగ్య సమస్యలుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..