Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: దిగుబిడ్డ నీ సంగతి చూస్తా..! ఎద్దు దెబ్బకు 2 గంటల పాటు చెట్టుపైనే మనోడి అవస్థలు..

గతంలో కూడా ఈ ఎద్దు మనుషులపై దాడి చేసి పలువురిని గాయపరిచిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఈసారి వీడియో బయటకు రావడంతో విషయం డీఎంకు చేరడంతో దీనిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయితే, ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రాణాలను కాపాడుకోవడానికి దగ్గరలో ఉన్న ఒక ఎండిపోయిన చెట్టు ఎక్కి అక్కడి నుంచి కాపాడమంటూ అరవటం మొదలుపెట్టాడు. ఎద్దు కూడా అక్కడే ఆగింది...  పోట్ల గిత్తలా అతడి పైకి కాళ్లు దువ్వుతూ భయపెడుతోంది.

Watch: దిగుబిడ్డ నీ సంగతి చూస్తా..! ఎద్దు దెబ్బకు 2 గంటల పాటు చెట్టుపైనే మనోడి అవస్థలు..
Bull In Ballia
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 01, 2023 | 1:21 PM

విచ్చలవిడిగా సంచరించే జంతువుల వల్ల ఉత్తరప్రదేశ్‌లోని రైతులు చాలా నష్టపోవాల్సి వస్తోంది. అయితే గోశాలలో జంతువులను బహిరంగ ప్రదేశంలో ఉంచరాదని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు అందాయి. అయినప్పటికీ అనేక ఆవులు, ఎద్దులు వీధుల వెంబడి ఇప్పటికీ స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. ఎద్దు భయంతో ఓ రైతు గంటల తరబడి చెట్టుపైనే కూర్చుని ప్రాణాలు రక్షించుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా నుంచి వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. వైరల్‌ అవుతున్న వీడియోలో.. ఒక రైతు చెట్టుపై ఎక్కి కూర్చున్నట్లు క్లియర్‌గా కనిపిస్తుంది. అక్కడ ఎద్దు అతడిని కోపంగా చూస్తోంది. మనిషి చెట్టెక్కి కూర్చుని ఉన్నాడు. అతని చుట్టు పక్కల కూడా ఎవరూ లేరు. అటువంటి పరిస్థితిలో అతను తన ప్రాణాలను కాపాడుకోవడానికి చెట్టు ఎక్కవలసి వచ్చింది. సుమారు రెండు గంటల పాటు రైతు చెట్టుపైనే కూర్చుని ఉండిపోవాల్సి వచ్చింది.

బల్లియా జిల్లా రాస్దా తహసీల్‌కు చెందిన సావ్రా పాండేపూర్‌లో ఈ సంఘటన జరిగింది. గ్రామానికి చెందిన రఘునందన్ సాయంత్రం తన పొలం నుండి తిరిగి వస్తున్నాడు. అప్పుడు ఒక ఎద్దు వారిని వెంబడించడం ప్రారంభించింది. ప్రాణాలను కాపాడుకోవడానికి దగ్గరలో ఉన్న ఒక ఎండిపోయిన చెట్టు ఎక్కి అక్కడి నుంచి కాపాడమంటూ అరవటం మొదలుపెట్టాడు. ఎద్దు కూడా అక్కడే ఆగింది…  పోట్ల గిత్తలా అతడి పైకి కాళ్లు దువ్వుతూ భయపెడుతోంది. ఎట్టకేలకు రైతు అరుపులు విన్ని స్థానిక గ్రామస్తులు, రైతులు తరలి వచ్చి ఎద్దును తరిమికొట్టి రైతు ప్రాణాలను కాపాడారు.

ఇవి కూడా చదవండి

ఈ విషయం జిల్లా మేజిస్ట్రేట్‌కు చేరిందని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బహిరంగ ప్రదేశాల్లో సంచరించే జంతువులను గోశాలలకు తరలించేలా సంబంధిత అధికారులను ఆదేశించామని జిల్లా మేజిస్ట్రేట్ తెలిపారు.

ఇదిలా ఉంటే, గతంలో కూడా ఈ ఎద్దు మనుషులపై దాడి చేసి పలువురిని గాయపరిచిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఈసారి వీడియో బయటకు రావడంతో విషయం డీఎంకు చేరడంతో దీనిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయితే, ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..