AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yogi Adityanath: అలాంటి వారిని ఎవ్వరినీ వదిలిపెట్టొద్దు.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక ఆదేశాలు..

యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. ఒకరి భూమిని ఆక్రమించుకున్న వారిని, బలహీనులను నాశనం చేసేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని యోగి ఆదిత్యనాథ్ అధికారులను మరోసారి ఆదేశించారు. ప్రభుత్వం ఎవరికీ అన్యాయం చేయదని.. అన్యాయం చేసేవారిని వదిలిపెట్టదని.. ప్రతి వ్యక్తి జీవితంలో ఆనందాన్ని తీసుకురావాలని నిశ్చయించుకుందని యోగి తెలిపారు. గోరఖ్‌నాథ్ ఆలయంలో సీఎం యోగి దాదాపు 400 మందిని కలిసి వారి సమస్యలను విని.. అధికారులకు పలు సూచనలు చేశారు.

Yogi Adityanath: అలాంటి వారిని ఎవ్వరినీ వదిలిపెట్టొద్దు.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక ఆదేశాలు..
UP CM Yogi Adityanath
Shaik Madar Saheb
|

Updated on: Aug 01, 2023 | 3:41 PM

Share

గోరఖ్‌పూర్‌, ఆగస్టు 1: శాంతి భద్రతల విషయంలో వెనక్కి తగ్గే పనేలేదని.. కఠినంగా వ్యవహరించాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరోసారి అధికారులను ఆదేశించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ సోమవారం ఉదయం గోరఖ్‌నాథ్ ఆలయంలో ‘జనతా దర్శన్’ నిర్వహించారు. ఈ సందర్భంగా తమ గొడును చెప్పుకునేందుకు వచ్చిన ప్రజలను కలిసి.. వారి సమస్యలను విన్నారు. ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. ఒకరి భూమిని ఆక్రమించుకున్న వారిని, బలహీనులను నాశనం చేసేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని యోగి ఆదిత్యనాథ్ అధికారులను మరోసారి ఆదేశించారు. ప్రభుత్వం ఎవరికీ అన్యాయం చేయదని.. అన్యాయం చేసేవారిని వదిలిపెట్టదని.. ప్రతి వ్యక్తి జీవితంలో ఆనందాన్ని తీసుకురావాలని నిశ్చయించుకుందని యోగి తెలిపారు.

గోరఖ్‌నాథ్ ఆలయంలో సీఎం యోగి దాదాపు 400 మందిని కలిసి వారి సమస్యలను విని.. అధికారులకు పలు సూచనలు చేశారు. తన హయాంలో ఎవరికీ అన్యాయం జరగదని అందరికీ భరోసా ఇచ్చారు. ప్రతి బాధితుడి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని హామీ ఇచ్చారు.

ఈ సమయంలో, చికిత్స కోసం ఆర్థిక సహాయం కోరుతూ చాలా మంది సీఎం యోగి ఆదిత్యనాథ్ ను కలిశారు. చికిత్సకు ప్రభుత్వం పూర్తి సహాయాన్ని అందజేస్తుందని సీఎం యోగి వారికి హామీ ఇచ్చారు. చికిత్సకు సంబంధించిన అంచనాల ప్రక్రియను త్వరగా పూర్తి చేసి ప్రభుత్వం ద్వారా వారికి సాయం చేయాలని అధికారులను ఆదేశించారు.

రెవెన్యూ, పోలీసులకు సంబంధించిన అంశాలను పూర్తి పారదర్శకంగా, న్యాయంగా పరిష్కరించాలని, ఎవరికీ అన్యాయం జరగకూడదని, ప్రతి బాధితురాలిని సున్నితత్వంతో ఆదుకోవాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..