No Trust Motion: అవిశ్వాస తీర్మానంపై పార్లమెంట్‌లో జరగనున్న చర్చ.. ఎప్పుడంటే
ప్రస్తుతం మణిపుర్‌లో జరుగుతున్న అల్లర్లు ఇంకా ముగిసిపోలేదు. ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దీంతో కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. విపక్ష పార్టీలతో సహా ప్రజలు కూడా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లోని ఉభయ సభల్లో ఈ అంశం లేవనెత్తడంతో వాయిదాల పర్వం కొనసాగింది. హోం మంత్రి అమిత్ షా బదులిస్తారని చెప్పినప్పటికీ ప్రతిపక్షాల మాత్రం వెనక్కి తగ్గలేదు.

పార్లమెంట్‌లో జరుగుతున్న వర్షాకాల సమావేశాల్లో మణిపుర్ అంశం కీలకంగా మారిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ మణిపుర్ అంశంపై మాట్లాడాలని విపక్ష పార్టీ నేతలు పట్టుబట్టారు. పలువురు బీజేపీ నాయకులు మాట్లాడానికి సిద్ధం అన్నప్పటికీ కూడా ప్రధాని ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఓ సమావేశం ఏర్పరుచుకుని అధికార ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించారు. అనుకున్నట్లుగానే ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే అవిశ్వాస తీర్మానాన్ని చర్చించేందుకు తేదీలు ఖరారయ్యాయి. విపక్షల ఎంపీలు ప్రవేశపెట్టిన ఈ తీర్మానంపై చర్చలు జరగనుంది. ఆగస్టు 8వ తేది నుంచి మూడు రోజుల పాటు ఇందుకు సంబంధించి చర్చ జరగనుంది. అయితే ఆగస్టు 10 వ తేదిన ప్రధాని మోదీ ప్రసంగం చేయనున్నాయి. తాజాగా లోక్‌సభ సభా వ్యవహారాల కమిటీ సమావేశం నిర్వహించగా.. ఈ సమావేశంలోనే నిర్ణయం తీసుకున్నారు.
ప్రస్తుతం మణిపుర్‌లో జరుగుతున్న అల్లర్లు ఇంకా ముగిసిపోలేదు. ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దీంతో కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. విపక్ష పార్టీలతో సహా ప్రజలు కూడా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లోని ఉభయ సభల్లో ఈ అంశం లేవనెత్తడంతో వాయిదాల పర్వం కొనసాగింది. హోం మంత్రి అమిత్ షా బదులిస్తారని చెప్పినప్పటికీ ప్రతిపక్షాల మాత్రం వెనక్కి తగ్గలేదు. చివరికి అవిశ్వాస తీర్మానాన్నే తమ అస్త్రాలుగా వినియోగించాయి. ఇదిలా ఉండగా లోక్‌సభలో ఎన్డీఏ కూటమికి పూర్తి స్థాయిలో మెజార్టీ ఉంది. ప్రతిపక్షాల కూటమి ఇండియాకు మాత్రం 144 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. విపక్షాలు ఈ అవిశ్వాస తీర్మానంపై గెలవడం సాధ్యం కాదని తెలిసినప్పటికీ కూడా.. ప్రధాని మోదీ మణిపుర్ అంశంపై స్పందించాలనే ఆలోచనతోనే దీన్ని ప్రవేశపెట్టారు.




మరోవైపు అవిశ్వాస తీర్మానంపై చర్చలు జరపకుండా కేంద్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని.. ఇప్పటిదాకా విపక్షాలు ఆరోపణలు చేశాయి. అయితే వీటిని బీజేపీ ఖండించింది. లోక్‌సభలో తమకు మూడింట రెండువంతుల మేజార్టీ ఉందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. బిల్లులను ప్రవేశపెట్టక ముందే విపక్షాలు ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానంపై చర్చలు చేపట్టాలనే నిబంధన లేదని ఆయన తెలిపారు. ఈ తీర్మానం ప్రవేశపెట్టిన 10 రోజుల్లోగా ఎప్పుడైన చేపట్టవచ్చని వెల్లడించారు. ఆగస్టు 10న ప్రధాని మోదీ ప్రసంగించనున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మణిపుర్ అంశంపై ఆయన ఏం మాట్లాడుతారు.. ఏం ప్రకటన చేస్తారు అనే దాని కోసం అందరు ఎదురుచుస్తున్న పరిస్థితి నెలకొంది.




