- Telugu News Photo Gallery Cricket photos Shubman Gill Breaks Imam Ul Haq's unique Record, becomes leading run scorer after 27 ODIs
Shubman Gill: మొన్న బాబర్.. నిన్న ఇమామ్.. పాకిస్తానీ ప్లేయర్ల రికార్డ్‌లనే టార్గెట్ చేసిన శుభమాన్..
Shubman Gill: ఐపీఎల్ తర్వాత పేలవ ప్రదర్శనతో విమర్శలకు గురైన టీమిండియా యువ ఓపెనర్ శుభమాన్ గిల్.. వెస్టిండీస్‌తో జరిగిన 3వ వన్డే ద్వారా ఫామ్‌లోకి వచ్చాడు. విండీస్ టీమ్‌పై 200 రన్స్ తేడాతో భారత్ విజయం సాధించిన ఈ మ్యాచ్‌లో గిల్ 85 పరుగులతో చెలరేగాడు. సెంచరీకి 15 పరుగుల దూరంలోనే పెవిలియన్ చేరిన అద్భుతమైన రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలా శుభమాన్ గిల్ 26 వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా బాబర్ అజామ్ రికార్డ్‌ను.. అలాగే 27 వన్డేల్లో అత్యధిక పరుగులు..
Updated on: Aug 02, 2023 | 1:45 PM

IND vs WI 3rd ODI: భారత్, వెస్టిండీస్ మధ్య మంగళవారం జరిగిన మూడో వన్డేలో శుభమాన్ గిల్ 85 పరుగులతో అద్భుతంగా ఆడాడు. తన 5వ సెంచరీ పూర్తి చేసేందుకు అవకాశం ఉన్నా 15 పరుగుల దూరంలోనే పెవిలియన్ చేరాడు.

ఒక వేళ శుభమాన్ గిల్ సెంచరీ చేసినట్లయితే... 28 వన్డేల కెరీర్‌లో 5 సెంచరీలు చేసిన ఆటగాడిగా శిఖర్ ధావన్ రికార్డ్‌ని సమం చేసేవారు. ధావన్ తన 28 వన్డేల్లోనే 5 సెంచరీలు బాదాడు. అలా శిఖర్ రికార్డ్‌ని సమం చేయకుండానే వెనుదిరిగిన శుభమాన్.. పాకిస్తానీ ప్లేయర్ల రికార్డులను మాత్రం వదిలిపెట్టలేదు.

భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన 2వ వన్డే ద్వారా.. తొలి 26వ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా బాబర్ అజామ్ రికార్డ్‌ని బద్దలు కొట్టాడు శుభమాన్. బాబర్ 26 వన్డేల్లో 1322 పరుగులు చేయగా.. శుభమాన్ 1352 పరుగులు చేసి ఆ రికార్డ్‌ను తన సొంతం చేసుకున్నాడు.

ఇదే తరహాలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 85 పరుగులు చేసిన శుభమాన్ పాకిస్థాన్‌కి చెందిన మరో ప్లేయర్ రికార్డ్‌ను బ్రేక్ చేశాడు. తొలి 27 వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా పాక్‌కి చెందిన ఇమామ్ ఉల్ హక్ 1381 రన్స్‌తో అగ్రస్థానంలో ఉన్నాడు.

భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన 3వ వన్డే ద్వారా 27వ మ్యాచ్ ఆడిన శుభమాన్.. ఇప్పటివరకు 1437 పరుగులు చేశాడు. దీంతో 27 వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా 1381 రన్స్‌తో అగ్రస్థానంలో ఉన్న ఇమామ్ ఉల్ హక్.. రెండో స్థానానికి పడిపోయాడు.

ఇలా శుభమాన్ గిల్ 26 వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా బాబర్ అజామ్ రికార్డ్‌ను.. అలాగే 27 వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా ఇమామ్ ఉల్ హక్ రికార్డ్‌ను బ్రేక్ చేసి అగ్రస్థానంలోకి చేరాడు.




