AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI: ధోనికే సొంతమైన అరుదైన రికార్డ్‌.. 2 వన్డేలతోనే సమం చేసిన ఇషాన్.. వన్డే క్రికెట్‌లో రెండో వికెట్ కీపర్‌గా..

Ishan Kishan: బర్బడోస్ వేదికగా జరిగిన రెండు వన్డేల్లోనూ అర్థసెంచరీలు చేసిన టీమిండియా యువ ప్లేయర్ ఇషాన్ కిషన్ ఓ అరుదైన ఘనతను తన సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో అతను టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పేరటి ఉన్న అరుదైన రికార్డును కూడా సమం చేయడం గమనార్హం. వెస్టిండీస్‌పై భారత్ తరఫున వరుసగా 2 హాఫ్ సెంచరీలు చేసిన ఏకైక వికెట్‌ కీపర్‌గా ఎంఎస్ ధోని రికార్డ్ సృష్టించాడు. 2017లో వెస్టిండీస్‌ పర్యటనకు భారత్ వెళ్లిగా..

IND vs WI: ధోనికే సొంతమైన అరుదైన రికార్డ్‌.. 2 వన్డేలతోనే సమం చేసిన ఇషాన్.. వన్డే క్రికెట్‌లో రెండో వికెట్ కీపర్‌గా..
కాగా, వెస్టిండీస్ పర్యటనలో భాగంగా ఆడిన రెండు వన్డేల్లోనూ ఇషాన్ కిషన్ వరుస హఫ్ సెంచరీలతో మెరవడంతో పాటు ధోని పేరిట ఉన్న అరుదైన రికార్డును‌ కూడా సమం చేశాడు. ఇన్నాళ్లూ ధోని మాత్రమే వెస్టిండీస్‌లో కరేబియన్లపై 2 వరుస వన్డే సెంచరీలు చేసిన రికార్డ్‌ను కలిగి ఉండగా.. ఇషాన్ కూడా వరుస హాఫ్ సెంచరీలతో దాన్ని సమం చేశాడు.
శివలీల గోపి తుల్వా
|

Updated on: Jul 31, 2023 | 12:16 PM

Share

Ishan Kishan: భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో వన్డేలో కరేబియన్లు టీమిండియాపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలసిందే. అంతకముందు జరిగిన తొలి వన్డేలో భారత్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో 3 వన్డేల సిరీస్ ప్రస్తుతం 1-1గా ఉంది. అయితే బర్బడోస్ వేదికగా జరిగిన రెండు వన్డేల్లోనూ అర్థసెంచరీలు చేసిన టీమిండియా యువ ప్లేయర్ ఇషాన్ కిషన్ ఓ అరుదైన ఘనతను సాధించాడు. ఈ క్రమంలో అతను టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పేరటి ఉన్న అరుదైన రికార్డును కూడా సమం చేయడం గమనార్హం. ఇంతకీ ఇషాన్ సాధించిన ఘనత ఏమిటంటే..?

వెస్టిండీస్‌‌లో కరేబియన్ల జట్టుపై వరుసగా 2 వన్డే హాఫ్ సెంచరీలు చేసిన ఏకైక వికెట్‌ కీపర్‌గా ఎంఎస్ ధోని రికార్డ్ సృష్టించాడు. 2017లో వెస్టిండీస్‌ పర్యటనకు భారత్ వెళ్లగా.. అప్పుడు జరిగిన వన్డేల్లో ధోని 78, 54 పరుగులతో 2 అర్థ శతకాలు బాదాడు. అయితే తాజాగా కరేబియన్ దీవుల్లోనే భారత్-వెస్టిండీస్ మధ్య జరిగిన రెండు వన్డేల్లోనూ అర్థశతాకలు బాదిన ఇషాన్.. ధోని రికార్డ్‌ను సమం చేశాడు. తొలి వన్డేలో 52 పరుగులు చేసిన ఇషాన్, రెండో వన్డలో 55 రన్స్ చేశాడు.

కాగా, వన్డే ప్రపంచకప్ కోసం సన్నాహాలు చేస్తున్న భారత్.. యువ ఆటగాళ్లతో ప్రయోగాత్మకంగా ఆడుతోంది. ఈ నేపథ్యంలోనే విండీస్‌తో జరుగుతోన్న వన్డే సిరీస్‌లో ఇషాన్ కిషన్, శుభమాన్ గిల్ జట్టు ఓపెనర్లుగా రంగంలోకి దిగుతున్నారు. ఇక తొలి మ్యాచ్‌లో అయితే ఓపెనర్‌గా రావాల్సిన రోహిత్ శర్మ ఏకంగా 7వ నెంబర్‌లో బ్యాటింగ్‌కి వచ్చాడు. ఇంకా రెండో వన్డే విషయానికి వస్తే మ్యాచ్ నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తప్పుకుని పూర్తి భారం యువ ఆటగాళ్ల భుజాలపై వేశారు. కానీ ఆ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో వెస్టిండీస్ చేతిలో ఓటమిపాలైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..