- Telugu News Photo Gallery Technology photos OnePlus 10 Pro 5G now available with big discount Offer on Amazon, check to know the details
Discount Offer: వన్‌ప్లస్ ఫోన్‌పై రూ.10 వేల తగ్గింపు.. అద్భుత ఫీచర్లే కాదు, అరగంటకే 100 శాతం చార్జ్.. వివరాలివే..
Smartphone Offer: తాము కొనుగోలు చేసే స్మార్ట్‌ఫోన్ ట్రెండీగా ఉండడంతో పాటు అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అలాంటివారి కోసం వన్‌ప్లస్ కంపెనీ ఎన్నో స్మార్ట్‌ఫోన్లను అందించింది. ఈ క్రమంలోనే వన్‌ప్లస్‌కి చెందిన ఓ స్మార్ట్‌ఫోన్‌పై రూ. 10 వేల తగ్గింపుతో భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. దానిలో ఎన్నో రకాల ఫీచర్లు కూడా ఉన్నాయి.
Updated on: Jul 30, 2023 | 9:56 PM

అయితే అమెజాన్ అందిస్తున్న ఆఫర్ ద్వారా మీరు 8GB RAM వేరియంట్‌ను రూ. 56,999 లకే కొనుగోలు చేయవచ్చు. ఇంకా క్రెడిట్ కార్డు ద్వారా రూ.5,000. వరకు అదనపు తగ్గింపు ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. కస్టమర్ల కోసం ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఇచ్చారు.

భారతదేశంలో OnePlus 10 Pro 5G స్మార్ట్‌ఫోన్ 2 మోడళ్లలో విడుదలయింది. 8GB RAM+128GB వేరియంట్ ధర రూ.66,999.. అలాగే 12GB RAM+256GB మోడల్ ప్రైస్ రూ.71,999.

వన్‌ప్లస్‌కి చెందిన OnePlus 10 Pro 5G స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్‌లో భారి తగ్గింపు ఆఫర్ ఉంది. ఈ ఫోన్ ప్రత్యేకత ఏమింటంటే ఇది కేవలం 32 నిమిషాల్లో సున్నా నుంచి 100 శాతం చార్జ్ అవుతుంది.

ఈ OnePlus 10 Pro 5G స్మార్ట్‌ఫోన్‌లో 1,440×3,216 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల QHD+ లిక్విడ్ AMOLED డిస్‌ప్లే ఉంది. ఇంకా ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 SoC ప్రాసెసర్‌ని కూడా కలిగి ఉంది.

ఈ ఫోన్ కెమెరా సెటప్‌లో 48-మెగాపిక్సెల్ Sony IMX789 సెన్సార్ ప్రైమరీ కెమెరా, 50-మెగాపిక్సెల్ Samsung ISOCELL JN1 అల్ట్రా-వైడ్ లెన్స్‌తో సెకండరీ కెమెరా, , 8-మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కలిగిన మూడో కెమెరా.. ఇంకా 32-మెగాపిక్సెల్ సోనీ IMX615 సెన్సార్‌తో సెల్ఫీ కెమెరా ఉన్నాయి.

ఇక దీని బ్యాటరీ బ్యాకప్ 5,000mAh బ్యాటరీ కాగా, ఇది 80W SuperWook వైర్డ్ ఛార్జింగ్, 50W AirWook వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సప్పోర్ట్ చేస్తుంది.





























