IND vs WI: ‘టీమిండియా పెద్ద తోపేం కాదు’.. రోహిత్ సేనకు మాజీ ప్లేయర్ చివాట్లు..
Venkatesh Prasad: శనివారం జరిగిన రెండో వన్డేలో భారత్ ఓడిపోయిన నేపథ్యంలో వెంకటేశ్ ప్రసాద్ స్పందిస్తూ ట్వీట్ చేశాడు. తన ట్వీట్‌లో ప్రసాద్ ‘టెస్ట్ క్రికెట్ మినహా రెండు ఫార్మాట్లలోనూ టీమిండియా చాలా అర్డినరీగా ఆడుతోంది. బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లను కోల్పోయింది. చివరి 2 టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లోనూ పేలవంగా ఆడింది. భారత జట్టు ఇంగ్లాండ్ లాంటి ఎక్జైటింగ్ టీమ్ లేదా..
Venkatesh Prasad: వెస్టిండీస్ చేతిలో రెండో వన్డే ఓడిపోయిన భారత జట్టుపై అటు అభిమానులు, ఇటు మాజీలు విమర్శలు కురిపిస్తూనే ఉన్నారు. ‘ఇలా ఓడిపోవడమేనా వన్డే ప్రపంచకప్ కోసం చేసే సన్నాహాలు’ అంటూ పలువురు అభిమానులు మండిపడుతున్నారు. ఈ కాలం ఆటగాళ్లు డబ్బు, గర్వం వల్ల ఆటపై దృష్టి సారించడంలేదని టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కూడా విమర్శించాడు. ఈ తరహాలోనే మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ కూడా భారత జట్టు ఆటతీరుపై విమర్శనాస్త్రాలు సంధించాడు. అన్ని ఉన్నా టీమిండియా దారుణంగా విఫలమవుతోందని, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో చేతులెత్తేస్తోందని ప్రసాద్ అన్నాడు.
శనివారం జరిగిన రెండో వన్డేలో భారత్ ఓడిపోయిన నేపథ్యంలో వెంకటేశ్ ప్రసాద్ స్పందిస్తూ ట్వీట్ చేశాడు. తన ట్వీట్‌లో ప్రసాద్ ‘టెస్ట్ క్రికెట్ మినహా రెండు ఫార్మాట్లలోనూ టీమిండియా చాలా అర్డినరీగా ఆడుతోంది. బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లను కోల్పోయింది. చివరి 2 టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లోనూ పేలవంగా ఆడింది. భారత జట్టు ఇంగ్లాండ్ లాంటి ఎగ్జైటింగ్ టీమ్ లేదా ఆసీస్ లాంటి దూకుడు జట్టు కాదు. డబ్బు, అధికారం ఉన్నా సాధారణ విజయాలకే సంబరాలు చేసుకుంటున్నాం. చాంపియన్‌గా భారత జట్టు చాలా దూరంలో ఉంది. భారత్ సహా అన్ని జట్లు చాంపియన్ అవ్వాలనే ఆడతాయి కానీ కాలానుగుణంగా మారిన టీమిండియా వైఖరి, ఆటతీరు పేలవ ప్రదర్శనకు ప్రధాన కారణమ’ని రాసుకొచ్చాడు.
Test cricket aside, India has been very ordinary in the other two formats for quite sometime now. Lost odi series against ban, SA and Aus. Poor in the last two T20 World Cups. Neither are we an exciting team like England nor brutal like how the Aussies used to be. Cont
— Venkatesh Prasad (@venkateshprasad) July 30, 2023
కాగా, వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత జట్టు.. కరేబియన్లపై 1-0 తేడాతో టెస్ట్ సిరీస్‌ని గెలుచుకుంది. ఆ తర్వాత వన్డే సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో గెలిచినా.. రెండోదానిలో ఘోరంగా విఫలమైంది. దీంతో 3 వన్డేల సిరీస్ ప్రస్తుతం 1-1 గా సమమైంది. ఇక మంగళవారం జరిగే మూడో వన్డేలో గెలిస్తేనే సిరీస్ మన సొంతం. లేకుండా పేలవ ప్రదర్శనతో వన్డే వరల్డ్‌కప్ టోర్నీకి అర్హత సాధించలేని వెస్టిండీస్ టీమ్ జట్టు చేతిలో వన్డే సిరీస్‌ని కోల్పోయామన్న అపకీర్తిని మూటకట్టుకోవాల్సి వస్తుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..