Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: రిసెప్షన్‌లోనే వధూవరుల మధ్య యుద్ధం.. కానీ అంతలోనే మళ్లీ.. వైరల్ అవుతున్న వీడియో..

Viral Video: వైవాహిక జీవితంలో అడుగుపెట్టే ఏ జంట అయినా తమ పెళ్లి  సమయంలో మాత్రం ఎంతో సౌమ్యంగా, శాంతమూర్తిలా కనిపిస్తారు. అయితే అందుకు విరుద్ధంగా ఓ జోడీ మాత్రం తమ పెళ్లి రిసెప్షన్‌లోనే యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు. వారికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇంతకీ ఆ వైరల్ అవుతున్న..

Viral Video: రిసెప్షన్‌లోనే వధూవరుల మధ్య యుద్ధం.. కానీ అంతలోనే మళ్లీ.. వైరల్ అవుతున్న వీడియో..
War At Varmala
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jul 30, 2023 | 9:21 PM

Viral Video: వైవాహిక జీవితంలో మనస్పర్థలు, గొడవలు రావడం.. ఆ తర్వాత అవన్ని సద్దుమనగడమనేది సర్వసాధారణమైన విషయం. అయితే వైవాహిక జీవితంలో అడుగుపెట్టే ఏ జంట అయినా తమ పెళ్లి  సమయంలో మాత్రం ఎంతో సౌమ్యంగా, శాంతమూర్తిలా కనిపిస్తారు. అయితే అందుకు విరుద్ధంగా ఓ జోడీ మాత్రం తమ పెళ్లి రిసెప్షన్‌లోనే యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు. వారికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇంతకీ ఆ వైరల్ అవుతున్న వీడియోలో ఏం జరిగిందంటే..?

వైరల్ వీడియో ప్రారంభమయ్యే ముందుగా నవ వధూవరులు పూల మాలలను మార్చుకునేందుకు వాటిని చేతుల్లో పట్టి నిలుచున్నారు. అయితే ఉన్నట్లుంగా ఒకరి కంటే ముందు మరొకరు వేయాలని పోటీ పడ్డారు. వరుడిని వెనుక నుంచి వేరే వ్యక్తి ఎత్తుకోవడంపై సదరు పెళ్లికొడుకు వధువు మెడలో పూల మాలను ముందుగా వేయగలిగాడు. అయితే ఆ వెంటనే ఏం జరగలేదన్నట్లుగా వరుడు తన భార్య మెడలో తొందరపాటులో వేసిన పూలమాలను సరిచేశాడు. వీడియో చూడడానికి కొన్ని క్షణాలే ఉన్నప్పటికీ ఇద్దరి మధ్య గట్టి పోటీ జరిగింది.

ఇవి కూడా చదవండి

కాగా, ఈ వీడియోను చూసిన నెటిజన్లు పెళ్లిని సర్కస్‌లా మార్చారని అంటున్నారు. ఇంకా ఇక్కడ పూలమాలలు మార్చుకుంటున్నారా లేదా ఇంకేమైనా జరుగుతోందా అని.. చూడడానికి వీడియో చాలా ఫన్నీగా ఉండని పలువురు కామెంట్ చేశారు.

ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..