AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గంజాయితో పట్టుబడ్డ రంజీ మాజీ క్రికెట్ ప్లేయర్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో 25 వరకు చీటింగ్ కేసులు..

Srikakulam News: ప్రముఖుల పేర్లు చెప్పి వరుస మోసాలకు పాల్పడుతూ వస్తున్నాడు నాగరాజు. మాజీ క్రికెటర్ ఎంఎస్‌కే ప్రసాద్ పేరు చెప్పి పలు కార్పొరేట్ కంపెనీలకు ఫోన్ లు చేసి వర్థమాన రంజీ క్రికెటర్ నాగరాజుకి స్పాన్సర్‌ చేయాలని పెద్ద మొత్తంలో రూ.లక్ష లను తన బ్యాంకు ఖాతాలకు జమ చేయించుకుని మోసాలకు పాల్పడ్డాడు.బాధితుల ఫిర్యాదులతో పలుమార్లు కాటకటాల పాలయ్యాడు. ఆ తురువాత కూడా తగ్గేదే లే అన్నట్టు నేరాలకు పాల్పడుతునే ఉన్నాడు. బెయిల్ పై రావటం మళ్ళీ మోసాలకు పాల్పడటం..

గంజాయితో పట్టుబడ్డ రంజీ మాజీ క్రికెట్ ప్లేయర్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో 25 వరకు చీటింగ్ కేసులు..
Former Ranji Cricketer Player Nagaraju
S Srinivasa Rao
| Edited By: |

Updated on: Jul 31, 2023 | 12:39 PM

Share

శ్రీకాకుళం, జూలై 31: కుక్క తోక వంకర అన్న సామెత ఆ రంజీ మాజీ క్రికెట్ ప్లేయర్ కి సరిగ్గా సూటవుద్ధి. ఒకదాని తర్వాత ఒకటిగా నేరాలు చేయటం, జైలుకి వెళ్లి రావటం ఆయనకు పరిపాటి. ఈజీ మనీకి అలవాటు పడి బంగారు భవిష్యత్ ని చేతులారా తనే నాశనం చేసుకున్నాడు. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం యవ్వారపు పేటకి చెందిన నాగరాజు కడు పేదరికంలో పుట్టినప్పటికీ స్వసక్తితో అంచలంచలుగా రంజి క్రికెటర్ స్థాయికి ఎదిగాడు. అయితే దానిని నిలుపుకోలేక పోయాడు. అత్యాశకు పోయి మోసాలకు పాల్పడుతూ ఒక్కసారిగా పాతాళానికి దిగజారిపోయాడు. ఆదివారం ఉదయం శ్రీకాకుళం లోని సీపన్నాయుడు పేట జాతీయ రహదారి పక్కన బుడుమూరు నాగరాజును గoజాయితో పట్టుకున్నారు శ్రీకాకుళం టూ టౌన్ పోలిసులు. ఇతని నుండి రెండు బ్యాగులతో 23 కేజీ ల గంజాయిని స్వాధీనం చేసుకుని అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఒరిస్సా లోని పర్లాకిమిడి రైల్వే స్టేషన్ వద్ద ఓ వ్యక్తి నుండి గంజాయిని కొనుగోలు చేసినట్లు పోలిసుల విచారణలో చెప్పాడు. దీంతో ముచ్చటగా మరోసారి కటకటాల పాలయ్యాడు నాగరాజు.

గతంలో పలు కార్పొరేట్ కంపెనీలకు టోకరా ఎంబీఏ గ్రాడ్యుయేట్ అయిన నాగరాజు క్రికెట్‌లో మెరుపులు మెరిపించి స్వశక్తితో రంజీ క్రికెటర్ స్థాయికి ఎదిగాడు. తనకంటూ ప్రత్యేక గుర్తిపును తెచ్చుకున్నాడు.మంచి కెరీర్ అందుకోవల్సిన సమయంలో తన వక్రబుద్ధిని చూపాడు. నాగరాజుపై రెండు తెలుగు రాష్ట్రాలలో 30 వరకు కేసులు ఉన్నాయి. అందులో 25 వరకు చీటింగ్ కేసులు ఉన్నాయి. ఏపీ ముఖ్యమంత్రి ఓఎస్‌డీ నీ అని… తెలంగాణ మంత్రి కేటీఆర్ పీఏ నీ అనీ… దేశంలోని పలు కార్పొరేట్ కంపెనీలకు ఫోన్ కాల్స్ చేసి బెదిరించి అక్రమ వసూలు చేసాడు.

ప్రముఖుల పేర్లు చెప్పి వరుస మోసాలకు పాల్పడుతూ వస్తున్నాడు నాగరాజు. మాజీ క్రికెటర్ ఎంఎస్‌కే ప్రసాద్ పేరు చెప్పి పలు కార్పొరేట్ కంపెనీలకు ఫోన్ లు చేసి వర్థమాన రంజీ క్రికెటర్ నాగరాజుకి స్పాన్సర్‌ చేయాలని పెద్ద మొత్తంలో రూ.లక్ష లను తన బ్యాంకు ఖాతాలకు జమ చేయించుకుని మోసాలకు పాల్పడ్డాడు.బాధితుల ఫిర్యాదులతో పలుమార్లు కాటకటాల పాలయ్యాడు. ఆ తురువాత కూడా తగ్గేదే లే అన్నట్టు నేరాలకు పాల్పడుతునే ఉన్నాడు. బెయిల్ పై రావటం మళ్ళీ మోసాలకు పాల్పడటం ఇతగాడికి పరిపాటిగా మారింది. ఈ ఏడాది జనవరిలో గంజాయి అక్రమ రవాణా చేస్తూ టెక్కలి పోలీసులకు చిక్కాడు. అoతకు ముందు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం పోలీసు స్టేషన్ పరిధిలోను గoజాయితో పట్టుబడ్డాడు.

స్టార్టింగ్ లో ఇతని ఆట తీరు చూసి పలువురు స్పాన్సర్లు ఆర్థిక సాయం అందించారు. వాటితో కెరీర్ కి మెరుగులు దిద్దుకోవలసిన నాగరాజు లెగ్జరీలకు అలవాటు పడి మోసగాడు అవతారమెత్తాడు. ఈజీ మానీకి అలవాటు పడి బంగారు భవిష్యత్ నీ చేతులారా నాశనం చేసుకున్నాడు.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం