MLC 2023: 10 ఫోర్లు, 13 సిక్సర్లు, 137 పరుగులు.. దుమ్మురేపిన ‘MI’ ప్లేయర్.. ఆరంగేట్ర విజేతగా ముంబై ఇండియన్స్..
MLC 2023 Final: న్యూయార్క్ సిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ముంబై ఇండియన్స్.. సీటెల్ ఓర్కాస్ జట్టుపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించి టైటిల్‌ని తన ఖాతాలో వేసుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో ‘ఎమ్ఐ న్యూయార్క్’ టీమ్‌కి కెప్టెన్‌గా ఆడిన నికోలస్ పూరన్ ప్రత్యర్థి జట్టుపై విరుచుకుపడ్డాడు. కేవలం 55 బంతుల్లోనే అజేయంగా 137 పరుగులు చేసి తన జట్టును ఆరంగేట్ర ఎమ్ఎస్‌సీ విజేతగా నిలిపాడు. ఈ క్రమంలో పూరన్ 13 సిక్సర్లు, 10 ఫోర్లు..
MLC 2023 Final: ఐపీఎల్ 2023 టోర్నీలో ముంబై ఇండియన్స్ జట్టు తన అభిమానులను నిరాశపరిచినప్పటికీ., మేజర్ లీగ్ క్రికెట్(MLC 2023) టోర్నమెంట్‌లో ఆరంగేట్ర ఛాంపియన్‌గా నిలిచింది. అమెరికాలో జరిగిన ఈ క్రికెట్ లీగ్‌లో న్యూయార్క్ సిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ముంబై ఇండియన్స్.. సీటెల్ ఓర్కాస్ జట్టుపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించి టైటిల్‌ని తన ఖాతాలో వేసుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో ‘ఎమ్ఐ న్యూయార్క్’ టీమ్‌కి కెప్టెన్‌గా ఆడిన నికోలస్ పూరన్ ప్రత్యర్థి జట్టుపై విరుచుకుపడ్డాడు. కేవలం 55 బంతుల్లోనే అజేయంగా 137 పరుగులు చేసి తన జట్టును ఆరంగేట్ర ఎమ్ఎస్‌సీ విజేతగా నిలిపాడు. ఈ క్రమంలో పూరన్ 13 సిక్సర్లు, 10 ఫోర్లు కూడా బాదాడు.
అయితే ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీటెల్ ఓర్కాస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఈ క్రమంలో ఓర్కాస్ తరఫున క్వింటన్ డీకాక్ 52 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 87 రన్స్ చేయగా.. శుభామ్ రంజనే 29 పరుగులతో పర్వాలేదనిపించాడు. ఇక న్యూయార్క్ బౌలర్లలో ట్రెంట్ బోల్ట్, రషిద్ ఖాన్ మూడేసి వికెట్లు తీసుకోగా.. స్టీవన్ టేలర్, డేవిడ్ వీస్ చేరో వికెట్ పడగొట్టారు. ఇలా 184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎంఐ న్యూయార్క్ 16 ఓవర్లలోనే పనిపూర్తి చేసింది. స్టీవన్ టేలర్, షయాన్ జహంగీర్ నుంచి శుభారంభం లభించకపోయినా వన్‌డౌన్ బ్యాటర్‌గా క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్ ప్రత్యర్థులపై 137 పరుగులతో విజృంభించాడు.
3 SIXES TO END THE LAST OVER OF THE POWERPLAY!
THIS IS SOMETHING SPECIAL, NICKY P!💙🥶🫡
8⃣0⃣/2⃣ (6.0) pic.twitter.com/pGRwHNz0nT
— Major League Cricket (@MLCricket) July 31, 2023
The fireworks had nothing on Nicky P tonight, NOTHING! 🎇The moment we became the first #MajorLeagueCricket champions. 🏆💙 #OneFamily #MINewYork pic.twitter.com/8bXE7Aq3V4
— MI New York (@MINYCricket) July 31, 2023
మొదటి 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ని అందుకున్నాడు. ఆ తర్వాత 40వ బంతి ఎదుర్కొటి సెంచరీని నమోదు చేశాడు. ఇలా 55 బంతుల్లోనే సిక్సర్లు, ఫోర్లతో 137 పరుగులు పూర్తి చేశాడు. ఇక చివర్లో టిమ్ డేవిడ్ 10 పరుగులతో తన వంతు పాత్ర పోషించాడు. కాగా, 184 పరుగుల లక్ష్యంతో దాదాపు 70 శాతం పరుగులు పూరన్ బ్యాట్ నుంచే రావడం గమనార్హం. దీంతో ఎంఐ న్యూయార్క్ టీమ్ సీటెల్ ఓర్కాస్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించడంతో పాటు టోర్నీ విజేతగా నిలిచింది. ఇంకా పూరన్ టీ20 కెరీర్‌లో ఇది అతనికి అత్యధిక స్కోర్, ఇంకా రెండో సెంచరీ.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..