Andhra Pradesh: కాసుల పంట ఖర్జూరం.. ఒక్కసారి నాటితే 80 ఏళ్ల వరకు దిగుబడి.. ఒక్కో చెట్టుకు 100కేజీలు..

Nandyal: ఇప్పుడిప్పుడే ఖర్జూర పంట సాగుపై రాయలసీమ ప్రాంత రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. ఎడారి దేశాలైన అరబ్ దేశాల్లో పండే ఈ ఖర్జూర పంట మన రాయలసీమ ప్రాంతంలో కూడా సాగు చేస్తూ ఈ ప్రాంత రైతులు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. సాగు సమయంలో కొంచెం ఖర్చు ఎక్కువైనప్పటికీ మూడు నుండి నాలుగు సంవత్సరాలలో పంట చేతికి రావడం. ఒకసారి మొక్కలు నాటితే దాదాపు 80 ఏళ్ల పాటు పంట దిగుబడి వస్తుండడం తో ఈ ఖర్చూర సాగుపై రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు.

Andhra Pradesh: కాసుల పంట ఖర్జూరం.. ఒక్కసారి నాటితే 80 ఏళ్ల వరకు దిగుబడి.. ఒక్కో చెట్టుకు 100కేజీలు..
Date Crops
Follow us
J Y Nagi Reddy

| Edited By: Jyothi Gadda

Updated on: Aug 02, 2023 | 11:56 AM

Andhra Pradesh: ఆయన ఒక సామాన్య రైతు… చదివింది పదో తరగతి మాత్రమే తెలిసిందల్లా వ్యవసాయం చేయడమే. అయితే, వ్యవసాయంపై మక్కువతో నూతన సాగు విధానాలకు స్వీకారం చుట్టారు. స్నేహితుని ద్వారా ఖర్జూరా పంట సాగు మెలకువలు తెలుసుకున్నాడు. ఖర్జూరాల సాగుతో వెనుతిరగని విజయం సాధించాడు. లక్షలు ఆర్జిస్తూ సాటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. నంద్యాల జిల్లాకు చెందిన ఓ రైతు విజయగాథ ఇది.. జిల్లాలోని బనగానపల్లె మండలం జంబులుదిన్నె కు చెందిన వంగల తిమ్మారెడ్డి దుబాయ్ నుండి దిగుమతి చేసిన విత్తనాలతో ప్లాంటేషన్ చేసిన మొక్కలను తమిళనాడు రాష్ట్రంలోని క్రిష్ణగిరి మండలం ధర్మపురి నర్సరీ నుంచి కొనుగోలు చేశాడు. ఒక్కో మొక్కను పొలంలో నాటడానికి సుమారు రూ.5000 వరకు ఖర్చు చేశారు.

తిమ్మారెడ్డి తనకున్న5 ఎకరాల్లో ఈ ఖర్జూర పంట సాగు చేశారు. ఎకరానికి 80 మొక్కలు చొప్పున నాటారు. వీటిలో 70 మొక్కలు ఆడ మొక్కలు అయితే, 10 మగ మొక్కలు నాటవలసి ఉంటుంది. ఇలా ఐదు ఎకరాల్లో పంట సాగు చేయడం జరిగింది. మొక్కల కొనుగోలుతో పాటు ఇతర వ్యవసాయ ఖర్చులు మొత్తం కలిపి 20 లక్షల నుండి 25 లక్షల వరకు ఖర్చు చేశారు. మూడేళ్లపాటు మొక్కలను సంరక్షించాల్సి ఉంటుంది.

మూడేళ్ల తర్వాత పంట దిగుబడి రావడం ప్రారంభమవుతుంది. ఒక్కొ చెట్టు 100 కేజీల ఖర్జూరాల పంటను ఇస్తుంది. ఇలా ఎకరానికి ఆరు టన్నుల నుండి ఏడు టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఎకరానికి 6 లక్షల నుండి 7 లక్షల వరకు లాభం ఆర్జించవచ్చని రైతు అంటున్నారు. ఒక్కసారి ఖర్జూర మొక్కలు నాటితే 80 సంవత్సరాల పాటు పంట పొందవచ్చు అని రైతు తిమ్మారెడ్డి తెలిపారు.

ఇవి కూడా చదవండి

సాగు విధానం :-

ఖర్జూర మొక్కలను నాటేముందు భూసార పరీక్షలు చేయించాల్సి ఉంటుంది… ఖర్జూర సాగుకు పంట పొలం అనుకూలమా లేదా అనేది ఈ పరీక్షల ద్వారా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బనగానపల్లి సమీపంలోని యాగంటి కృషి విజ్ఞాన కేంద్రంలో భూసార పరీక్షలు చేయించినట్లు రైతు తెలిపారు. మొక్కకు మొక్కకు మధ్య ఎటు చూసినా 24 అడుగులు దూరం ఉండేలా నాటుకోవాలి. ఈ విధంగా ఎకరానికి 78 మొక్కలు నాటాల్సి ఉంటుంది. అందులో 70 ఆడ మొక్కలు…8 మగ మొక్కలు ఉండేలా చూసుకోవాలి.

జనవరి నెలలో ఖర్జూర చెట్లకు పూలు పూస్తాయి. అలా పూచిన పూలకు మగ ఖర్జూరా చెట్ల పూల నుండి సేకరించిన పుప్పడి తో క్రాసింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ దశలో రైతులు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

సేంద్రియ ఎరువులే ప్రధానం..

ముఖ్యంగా ఈ పంట సాగుకు రసాయన ఎరువుల అవసరము అంతగా ఉండదు. ఈ పంటను పూర్తిగా ఆర్గానిక్ పండుగ చెప్పవచ్చు సేంద్రియ ఎరువులు వాడాల్సి ఉంటుంది. క్రిమిసంహారక మందుల అవసరం పెద్దగా ఉండదు. ముఖ్యంగా ఈ మొక్కల ఎదుగుదలకు మేక ఎరువు, వేప చెక్కతో తయారు చేసిన సేంద్రియ ఎరువులు వాడినట్లు రైతు తెలిపారు. వేప నూనెలతో చేసిన మిశ్రమం మొక్కల పై పిచికారి చేయవలసి ఉంటుంది. పంట చేతికందే దశలో ఖర్జూరాల గెలలకు రక్షణగా కవరుతో తొడుగు వేయాల్సి ఉంటుంది … ఇలా చేస్తే నాణ్యమైన ఖర్జూరాలు వస్తాయి.

మార్కెటింగ్ కీలకం..

ఖర్జూరాల పంటలను మార్కెటింగ్ చేసుకోవడం రైతుకు చాలా కీలకం …. వ్యాపారులకు సమాచారం అందించి వారి నుండి సరసమైన ధరకు ఖర్జూరాలు అమ్ముకోవాల్సి ఉంటుంది. పెద్ద పెద్ద నగరాల్లో వీటిని కొనే బయ్యర్లు ఉంటారు. ముఖ్యంగా తమిళనాడు, బెంగళూరుకు చెందిన వ్యాపారులు వీటిని కొనుగోలు చేస్తుంటారు. వారి ద్వారా పంటను అ మ్ముకోవాల్సి ఉంటుంది.

ఎకరానికి ఏడు లక్షల ఆదాయం..

రైతు దగ్గర నుండి వ్యాపారులు టన్ను ఖర్జూరాలు లక్ష రూపాయలతో కొనుగోలు చేస్తున్నారు. ఎకరానికి 7 వేల టన్నులు దిగుబడి రావచ్చు. ఈ లెక్కన ఏడు లక్షల ఆదాయాన్ని అర్జించవచ్చని రైతు తిమ్మారెడ్డి పేర్కొన్నారు.

ఖర్జూర సాగుపై ఆసక్తి చూపిస్తున్న రైతులు..

ఇప్పుడిప్పుడే ఖర్జూర పంట సాగుపై రాయలసీమ ప్రాంత రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. ఎడారి దేశాలైన అరబ్ దేశాల్లో పండే ఈ ఖర్జూర పంట మన రాయలసీమ ప్రాంతంలో కూడా సాగు చేస్తూ ఈ ప్రాంత రైతులు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. సాగు సమయంలో కొంచెం ఖర్చు ఎక్కువైనప్పటికీ మూడు నుండి నాలుగు సంవత్సరాలలో పంట చేతికి రావడం. ఒకసారి మొక్కలు నాటితే దాదాపు 80 ఏళ్ల పాటు పంట దిగుబడి వస్తుండడం తో ఈ ఖర్చూర సాగుపై రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..