AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: టీడీపీ హైకమాండ్‌కు చురకలంటించిన కోడెల శివరామ్‌.. కారణం ఏంటంటే..

అప్పటి నుంచి ఆగ్రహంతో రగిలిపోతున్న కోడెల శివరామ్.. ఆత్మీయ సమ్మేళనాలతో హీట్‌ పుట్టించారు. అంతటితో ఆగకుండా ఇంటింటికి వెళ్లి ప్రజల్ని పలకరించే ప్రయత్నం చేశారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలకు ఉండగా ఉంటానన్నారు శివరామ్‌. ఇంత జరుగుతున్న చంద్రబాబు పట్టించుకోవడం లేదన్నది శివరామ్ ఆవేదనగా కనిపిస్తోంది. మరోవైపు శివరామ్‌ ఇంటికెళ్లి టీడీపీ నేతలు చర్చలు కూడా జరిపారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు.. అధిష్టానం నోటీసులివ్వడం కలకలం రేపింది.

Andhra Pradesh: టీడీపీ హైకమాండ్‌కు చురకలంటించిన కోడెల శివరామ్‌.. కారణం ఏంటంటే..
TDP Leader Siva Ram
Shiva Prajapati
|

Updated on: Aug 02, 2023 | 11:12 AM

Share

సత్తెనపల్లి, ఆగష్టు 02: సత్తెనపల్లి టీడీపీలో నోటీసులు కల్లోలం రేపుతున్నాయి. కన్నా లక్ష్మీనారాయణ ఇంఛార్జ్‌గా బాధ్యతలు చేపట్టాక.. పార్టీ కార్యక్రమాల్లో కోడెల శివరామ్‌ ఆయన వర్గీయులు యాక్టివ్‌‌గా లేరని, అందుకు తగిన కారణాలు చెప్పాలంటూ మంగళవారం నాడు 16మందికి నోటీసులిచ్చింది టీడీపీ అధిష్టానం. ఈ నోటీసులపై ఇవాళ స్పందించిన కోడెల శివరామ్‌.. హైకమాండ్‌కి చురకలతో పాటు కౌంటర్లు ఇచ్చారు.

సత్తనెపల్లి టీడీపీ ఇంఛార్జ్‌గా కన్నా లక్ష్మీనారాయణ నియామకంతో రగడ మొదలైంది. అప్పటి నుంచి ఆగ్రహంతో రగిలిపోతున్న కోడెల శివరామ్.. ఆత్మీయ సమ్మేళనాలతో హీట్‌ పుట్టించారు. అంతటితో ఆగకుండా ఇంటింటికి వెళ్లి ప్రజల్ని పలకరించే ప్రయత్నం చేశారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలకు ఉండగా ఉంటానన్నారు శివరామ్‌. ఇంత జరుగుతున్నా చంద్రబాబు పట్టించుకోవడం లేదన్నది శివరామ్ ఆవేదనగా కనిపిస్తోంది. మరోవైపు శివరామ్‌ ఇంటికెళ్లి టీడీపీ నేతలు చర్చలు కూడా జరిపారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు.. అధిష్టానం నోటీసులివ్వడం కలకలం రేపింది.

దశాబ్దాలుగా పార్టీ అభివృద్దికి కష్టపడిన వాళ్లకు నోటీసులివ్వడం ఏంటని ప్రశ్నించారు కోడెల శివరామ్‌. చిలకలూరిపేట, నర్సరావుపేట, గురజాలలో చాలామంది టికెట్స్ ఆశిస్తున్నారు. వాళ్లంతా లోకేష్ ఎదుటే కొట్టుకున్నారు. వాళ్లకు ఇవ్వకుండా తనకు నోటీసులివ్వడమేంటని నిలదీశారు. టీడీపీ ఆఫీస్‌ ప్రారంభించినప్పటి నుంచి కన్నా లక్ష్మీనారాయణ అందులోకి వెళ్లనే లేదు. ఆయనకు నోటీసులివ్వకుండా తనకు ఇవ్వడంలో మతలబేంటంటున్నారు శివరామ్‌.

ఇవి కూడా చదవండి

మొన్నటిదాకా సత్తెనపల్లి టీడీపీ ప్రశాంతంగా ఉంది. అయితే ఒక్కసారిగా నోటీసులివ్వడం శివరామ్ వర్గీయుల్ని ఉలిక్కిపడేలా చేసింది. మరి శివరామ్ అండ్‌ కో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారా? కన్నా లక్ష్మినారాయణకు సహకరిస్తారా? ఒకవేళ సహకరించకుంటే అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..