AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: యువకుడికి కిక్కెక్కింది.. కారు చెట్టెక్కింది.. ఆ స్పీడు ఏ రేంజ్ లో ఉందంటే..

Visakhapatnam: బీభత్సం సృష్టించిన ఇన్నోవా పై.. పోలీసులు అనేకసార్లు ఫైన్  విధించినట్టు తెలుస్తోంది. వాహనం నెంబర్ ప్లేట్ కూడా నిబంధనలు ఉల్లంఘించినట్టుగా  గుర్తించారు. గతంలో హై స్పీడ్ పై కూడా ఒక చలాన్ కూడా విధించారు. త్రీ టౌన్ పోలీసులు పూర్తి ఎంక్వయిరీ ప్రారంభించారు. ప్రమాదం జరిగినప్పుడు కారు ఎవరు డ్రైవ్ చేస్తున్నారనే  దానిపై విచారణ కొనసాగుతోంది. వాహనం నడుపుతున్న వారిని ట్రాక్ చేస్తున్నారు పోలీసులు. ఘటనా స్థలంలో భయానక దృశ్యాలు కనిపిస్తున్నాయి. టూవీలర్లు చెల్లాచెదురుగా పడిపోయాయి. శకలాలు రోడ్డుపై విచ్చలవిడిగా కనిపిస్తున్నాయి. ఘటనను ప్రత్యక్షంగా చూసిన స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

Andhra Pradesh: యువకుడికి కిక్కెక్కింది.. కారు చెట్టెక్కింది.. ఆ స్పీడు ఏ రేంజ్ లో ఉందంటే..
Vizag Vip Road Car Accident
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Aug 02, 2023 | 11:29 AM

Share

విశాఖపట్నం, ఆగస్ట్02: విశాఖ విఐపి రోడ్డులో ఇన్నోవా బీభత్సం తీవ్ర కలకలం సృష్టించింది. హై స్పీడ్ గా దూసుకొచ్చిన ఇన్నోవా.. పార్కింగ్ లో ఉన్న వాహనాలను ఢీ కొట్టి చెట్టు పైకి ఎక్కింది. దాదాపుగా పది అడుగుల ఎత్తులో చెట్టుపైకి ఎక్కి ఆగింది. కారులో యువతి సహా ముగ్గురు ప్రయాణిస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఎనిమిది టూవీలర్లు ధ్వంసం అయ్యాయి. స్పాట్లో భయానక దృశ్యాలు కనిపిస్తున్నాయి. అదృష్టవశాత్తు పార్కింగ్లో జనం లేకపోవడంతో ప్రాణాపాయమే తప్పింది. కారును పోలీస్ స్టేషన్ కు తరలించారు.

బారు పార్కింగ్ నుంచి రోడ్డెక్కిన కారు.. ప్రమాదానికి అదే కారణమా..?!

విఐపి రోడ్ లో పేరుమోసిన సోమా రెస్టో బార్ ఉంది. ఆ బార్ పార్కింగ్ నుంచి బయటకు వచ్చింది ఇన్నోవా. కారులో ప్రయాణిస్తున్న వాళ్లు కూడా సోమా బార్ నుంచి బయటకు వచ్చినట్లు చెబుతున్నారు. తప్ప తాగి వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. సోమ బార్కు ఇన్నోవా వస్తున్నప్పుడు యువతి డ్రైవ్ చేస్తున్నట్టు కనిపించింది. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా ప్రమాదం జరిగినప్పుడు కారు డ్రైవింగ్ సీటులో యువకుడు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Vizag Road Accident

జనం ఉండి ఉంటే ప్రాణాపాయమే..

ఘటనా స్థలంలో భయానక దృశ్యాలు కనిపిస్తున్నాయి. టూవీలర్లు చెల్లాచెదురుగా పడిపోయాయి. శకలాలు రోడ్డుపై విచ్చలవిడిగా కనిపిస్తున్నాయి. ఘటనను ప్రత్యక్షంగా చూసిన స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మరి కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ రద్దీగా ఉండే విఐపి రోడ్లో అర్ధరాత్రి కావడంతో కాస్త తాకిడి తగ్గింది. వాహనాల పార్కింగ్ ప్లేస్ లో కూడా జనం లేకపోవడంతో ఘటన జరిగినప్పటికీ ఎవరికి ఎటువంటి ప్రాణహాని కలగలేదు. అయినా ఆరు టూవీలర్  ధ్వంసమైన దృశ్యాలు చూస్తుంటే అందరూ భయంతో వణికిపోతున్నారు.

ఇవి కూడా చదవండి

ఆ కారు ఆ జిల్లాదే..!

విశాఖ విఐపి రోడ్ లో కారు బీభత్సం ఘటనపై దర్యాప్తు ప్రారంభమైంది. AP 26BR 9 రిజిస్ట్రేషన్ నెంబర్ తో ఇన్నోవా క్రిష్ట కారు బీభత్సం సృష్టించింది. ఆరు వాహనాలను ధ్వంసం చేస్తూ పది అడుగుల చెట్టుపైకి ఎక్కి ఆగింది. వాహనం యశ్వంత్ ములుక్త పేరుతో రిజిస్ట్రేషన్ అయి ఉంది. నెల్లూరు వేదయపాలెం అడ్రస్ తో రిజిస్ట్రేషన్ అయి ఉంది వాహనం. సోమ బార్ లోకి వాహనం వెళుతున్న సమయంలో డ్రైవింగ్ సీట్లో యువతి ఉన్నట్టు పోలీసుల ప్రాథమిక గుర్తించారు. ప్రమాదం జరిగినప్పుడు కారు ఎవరు డ్రైవ్ చేస్తున్నారనే  దానిపై విచారణ కొనసాగుతోంది. వాహనం నడుపుతున్న వారిని ట్రాక్ చేస్తున్నరు పోలీసులు.

నిబంధనలో ఉల్లంఘన..

బీభత్సం సృష్టించిన ఇన్నోవా పై.. పోలీసులు అనేకసార్లు ఫైన్  విధించినట్టు తెలుస్తోంది. వాహనం నెంబర్ ప్లేట్ కూడా నిబంధనలు ఉల్లంఘించినట్టుగా  గుర్తించారు. గతంలో హై స్పీడ్ పై కూడా ఒక చలాన్ కూడా విధించారు. త్రీ టౌన్ పోలీసులు పూర్తి ఎంక్వయిరీ ప్రారంభించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..