Andhra Pradesh: ఊర్లో కొచ్చిన ఎలుగుబంటి హల్ చల్.. నడి ఊరి మధ్యలో చెట్టెక్కి కూర్చుని..

Kadapa District: సిద్ధవటం ప్రాంతం లంకమల అభయారణ్యంలో చిరుతలు ఎలుగుబంట్లు అనేకం ఉండడంతో అక్కడి ప్రజలు అప్రమత్తంగా ఉంటారు. ఎట్నుంచి ఏ జంతువులు ఊరిలోకి వస్తుందోనని ఓ కంట కనిపెడుతూ ఉంటారు. బుధవారం తెల్లవారుజామున అభయారణ్యం నుంచి జనావాసాల మధ్యలోకి వచ్చిన ఒక ఎలుగుబంటి అలజడి సృష్టించింది . సిద్ధవటం మండల కేంద్రమైన గ్రామచావీడు గ్రామంలో ఎలుగు బంటి హల్చల్ చేసింది. జనావాసాల మధ్యలో ఊరి నడుమనున్న ఓ చెట్టు పైకెక్కి కూర్చుంది..

Andhra Pradesh: ఊర్లో కొచ్చిన ఎలుగుబంటి హల్ చల్.. నడి ఊరి మధ్యలో చెట్టెక్కి కూర్చుని..
Follow us

| Edited By: Jyothi Gadda

Updated on: Aug 02, 2023 | 9:38 AM

కడప జిల్లా, ఆగస్ట్ 02: కడప జిల్లాలో అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్న ప్రాంతమైన సిద్ధవటంలో అప్పుడప్పుడు జనసంచారంలోకి జంతువులు వచ్చి సంచరిస్తూ ఉంటాయి. అయితే ఎక్కువ శాతం దుప్పి, జింకలు జనావాసంలోకి వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి . అయితే కడప జిల్లా సిద్ధవటం ప్రాంతం లంకమల అభయారణ్యంలో చిరుతలు, ఎలుగుబంట్లు కూడా ఉండడంతో అక్కడి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉంటారు. ఈరోజు లంకమల అభయారణ్యం నుంచి జనావాసాల మధ్యలోకి ఎలుగుబంటి వచ్చి అలజడి సృష్టించింది.

సిద్ధవటం మండల కేంద్రమైన గ్రామచావీడు గ్రామంలో బంటి హల్చల్ చేసింది. జనావాసాల మధ్యలోకి వచ్చి చెట్టు ఎక్కి కూర్చుంది స్థానిక ప్రజలు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అధికారులు వచ్చి ఎలుగుబంటిని అడవిలోకి పంపించే ప్రయత్నం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..