IIT Student: విషాదాంతమైన హైదరాబాద్ ఐఐటీ స్టూడెంట్ మిస్సింగ్ మిస్టరీ..
తెలంగాణ స్టూడెంట్ అదృశ్యం కేసు విషాదాంతమైంది. హైదరాబాద్ ఐఐటీలో చదువుకుంటున్న కార్తీక్.. ఈనెల 17న కనిపించకుండా పోయాడు. కంగారుపడ్డ కుటుంబసభ్యులు, స్నేహితులు అయిన వాళ్ల దగ్గర ఆరాతీశారు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్తీక్ కోసం సెర్చ్ చేస్తున్న సమయంలోనే అతను విగతజీవిగా కనిపించడం కుటుంబసభ్యుల్ని కన్నీరుమున్నీరయ్యేలా చేసింది.
తెలంగాణ స్టూడెంట్ అదృశ్యం కేసు విషాదాంతమైంది. హైదరాబాద్ ఐఐటీలో చదువుకుంటున్న కార్తీక్.. ఈనెల 17న కనిపించకుండా పోయాడు. కంగారుపడ్డ కుటుంబసభ్యులు, స్నేహితులు అయిన వాళ్ల దగ్గర ఆరాతీశారు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్తీక్ కోసం సెర్చ్ చేస్తున్న సమయంలోనే అతను విగతజీవిగా కనిపించడం కుటుంబసభ్యుల్ని కన్నీరుమున్నీరయ్యేలా చేసింది. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కార్తీక్ ఆచూకీ గుర్తించే ప్రయత్నం చేశారు పోలీసులు. కార్తీక్ ముందు సంగారెడ్డి నుంచి లింగంపల్లికి చేరుకుని ఎంఎంటీఎస్ ట్రైన్ లో సికింద్రాబాదు రైల్వే స్టేషన్ వెళ్లాడు. అక్కడి నుంచి జన్మభూమి ఎక్స్ ప్రెస్ లో విశాఖపట్నానికి వెళ్లినట్లు గుర్తించారు. లోకల్ పోలీసుల సాయంతో గాలింపు ముమ్మరం చేశారు. టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ బేకరీ షాప్‌కి వెళ్లి కూల్‌డ్రింక్ కొన్నట్టు ఐడెంటిఫై చేశారు. దాదాపు నాలుగు రోజుల పాటు బీచ్ రోడ్‌తో పాటు వేర్వేరు ప్రాంతాల్లో తిరిగాడు. ఓ వైపు పోలీసులు అతని కోసం వెతుకుతుండగానే అరిలోవ పీఎస్ సమీపంలో కార్తీక్ డెడ్‌బాడీ కనిపించింది. బీచ్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తేల్చారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
ఆంటీ అని పిలిచినందుకు.. మేల్ నర్స్‌కు జరిమానా
నేపాల్‌లో గుట్కా ఉమ్మిన భారతీయులు.. నీళ్లు పోసి కడిగించిన వీడియో
ప్రేతాత్మ తిరుగుతోందంటూ కాలేజీలో పూజలు
బార్బర్ షాపు ఓనర్ కి ₹72 లక్షల షాక్! GST నోటీసులతో లబోదిబో
కూతురికి విడాకులు మంజూరు.. బ్యాండ్ మేళంతో.. వేడుక చేసిన తండ్రి
నో ఫుడ్, నో ఫోన్.. అడవిలో తప్పిపోయిన టెకీ.. కట్ చేస్తే !!
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్

