Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: లుంగీనా మజాకా.. విదేశీ గడ్డపై సత్తా చాటిన దేశీ జుగాడ్‌.. వీడియో చూసి ఫిదా అవ్వాల్సిందే..🤣🤣🤣

లుంగీ.. పురుషులకు ఇంట్లో ఉన్నప్పుడు ధరించడానికి సులభమైన డ్రస్సులో ఒకటి. విశ్రాంతి తీసుకునేటప్పుడు లుంగీ ధరించడం వారు సౌకర్యంగా ఫీలవుతుంటారు. లుంగీని ఉపయోగించడం దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ఉంది. ప్రజలు దీనిని సాంప్రదాయకమైనా, వేడుకలైనా లేదా సాధారణమైనా వివిధ సందర్భాలలో సంప్రదాయ దుస్తులుగా ఉపయోగించడానికి ఇష్టపడతారు. లుంగీ కేవలం వస్త్రంగానే కాదు.. ప్రస్తుతం, సోషల్ మీడియా వేదికగా వీడియో వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు పన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

Watch: లుంగీనా మజాకా.. విదేశీ గడ్డపై సత్తా చాటిన దేశీ జుగాడ్‌.. వీడియో చూసి ఫిదా అవ్వాల్సిందే..🤣🤣🤣
Power Of Lungi Man
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 02, 2023 | 8:12 AM

మన దేశంలో చాలా మంది పురుషులు లుంగీలు ధరించి వీధుల్లో నడవడం సర్వసాధారణం. అయితే, విదేశీ దేశంలో భారతీయుడు లుంగీ కట్టుకుని బహిరంగంగా తిరుగుతున్న అరుదైన దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. ఇంకా, అతడు అక్కడితో ఆగలేదు.. లుంగీ కట్టుకుని షాపింగ్ మాల్‌లోకి ప్రవేశించాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే.. అవాక్కవ్వాల్సిందే. ప్రస్తుతం, సోషల్ మీడియా వేదికగా వీడియో వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు పన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. విదేశీ గడ్డపై అతడు మన లుంగీ శక్తి ఏంటో చూపించాడంటూ పలువురు ప్రశంసిస్తున్నారు. ఇంతకీ అతడు ఏం చేశాడంటే..

వైరల్‌ వీడియోలో షాపింగ్ మాల్‌లో లుంగీ కట్టుకున్న ఓ యువకుడు తనకు కావాల్సిన వస్తువులు తీసుకున్నాడు. అవసరమైన వస్తువులన్నీ ట్రాలీలో వేసుకున్నాడు.. ఇక షాపింగ్‌ పూర్తైనట్టుంది. బిల్లు కౌంటర్ దగ్గరికి వెళ్లి తన ట్రాలీని ఖాళీ చేశాడు. బిల్లు తీసుకున్న తర్వాత.. కౌంటర్ పక్కనుండి క్యారీ బ్యాగ్‌ బయటకు తీసుకున్నాడు. దాంతో అక్కడి సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు. క్యారీ బ్యాగ్‌కోసం డబ్బులు చెల్లించాలని చెప్పారు. దాంతో అతడు చిర్రెత్తిపోయాడు..వెంటనే తన లుంగీని విప్పి నేలపై పరిచాడు. తనుకొన్న వస్తువులను ఒక్కొక్కటిగా లుంగీలో సర్ధుకుని మూటగట్టేసుకున్నాడు.. కౌంటర్‌లో బిల్లు కట్టేసిన తర్వాత లుంగీలో చుట్టిన వస్తువుల మూట తీసుకొని బయటకు వెళ్లిపోయాడు..

ఇవి కూడా చదవండి

షాపింగ్ మాల్‌లో క్యారీ బ్యాగ్‌కి అదనంగా డబ్బులు చెల్లించడానికి అతడు ఒప్పుకోలేదు.. దాంతో ఇలా తెలివైన ఉపాయం చేశాడు. క్యారీ బ్యాగ్‌ కోసం ఎందుకు ఖర్చు చేయాలని భావించిన సదరు భారతీయుడు.. ‘దేశీ జుగాడ్’ని తయారు చేశాడు. హస్నా జరూరీ హై ట్విట్టర్‌లో షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెద్ద సంఖ్యలో వ్యూస్‌, లైకులతో వీడియో నెట్టింట మరింత సందడి చేస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..