Viral Video: ఇదేం ఘోరంరా నాయనా..! లూనాను ఢీకొట్టి తునాతునాకలైన బుల్లెట్.. అవాక్కవుతున్న నెటిజన్స్..
Luna and Bullet accident video: లూనా, బుల్లెట్ మధ్య ప్రమాదం జరిగిన వెంటనే.. అందరూ అక్కడికి వెళ్లి చూస్తుంటారు. వీడియో జనాలంతా గుమిగూడి ప్రమాదాన్ని చూస్తున్న దృశ్యం వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియోలో బుల్లెట్ ద్విచక్రవాహనం పూర్తిగా ధ్వంసమైంది. బుల్లెట్ హ్యాండిల్, ముందు టైరు పూర్తిగా విరిగిపోయాయి. లూనా మాత్రం స్ట్రాంగ్ గా ఉంది. ఈ ప్రమాదాన్ని చూసి.. జనం షాకయ్యారు. స్ట్రాంగ్ గా ఉండే బుల్లెట్ చిన్నపాటి యాక్సిడెంట్ కే మూడు ముక్కలు కావడం చూసి షాకయ్యారు.

Luna and Bullet accident video: సోషల్ మీడియానా మాజాకా..! నిత్యం ఎన్నో కొత్త విషయాలు.. మరెన్నో వీడియోలు.. చూస్తే అవాక్కయ్యేలా కనిపిస్తాయి. నిత్యం ఎన్నొ విషయాలు ట్రెండ్ అవుతుంటాయి.. వాటిని చూసి నెటిజన్లు ఫిదా అవుతుంటారు. తాజాగా.. ఓ ప్రమాదానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.. దీన్ని చూసి నెటిజన్లు ఎంటమ్మా.. ఇలా జరిగింది అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. సాధారణంగా.. నిత్యం ప్రమాదాల వీడియోలు ఇంటర్నెట్ ద్వారా వైరల్ అవుతుంటాయి. ఇందులో వ్యక్తులు బైక్‌లపై విన్యాసాలు చేస్తూ తమను తాము ప్రమాదంలో పడేసుకోవడంతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తారు. మరికొందరు.. ఘోర ప్రమాదాలకు గురవుతారు. తాజాగా.. లూనా, బుల్లెట్ బైక్.. రెండూ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లూనా (టీవీఎస్) భారీగా దెబ్బతిని ఉంటుంది అనుకుంటున్నారా..? అయితే మీరు పప్పులో కాలేసినట్లే.. ఎందుకంటే.. లూనాకు ఏమాత్రం దెబ్బతగలలేదు.. అత్యంత ఆదరణ పొందిన బుల్లెట్ మోటార్ సైకిల్ మాత్రం తునాతునకలైంది..
లూనా, బుల్లెట్ మధ్య ప్రమాదం జరిగిన వెంటనే.. అందరూ అక్కడికి వెళ్లి చూస్తుంటారు. వీడియో జనాలంతా గుమిగూడి ప్రమాదాన్ని చూస్తున్న దృశ్యం వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియోలో బుల్లెట్ ద్విచక్రవాహనం పూర్తిగా ధ్వంసమైంది. బుల్లెట్ హ్యాండిల్, ముందు టైరు పూర్తిగా విరిగిపోయాయి. లూనా మాత్రం స్ట్రాంగ్ గా ఉంది. ఈ ప్రమాదాన్ని చూసి.. జనం షాకయ్యారు. స్ట్రాంగ్ గా ఉండే బుల్లెట్ చిన్నపాటి యాక్సిడెంట్ కే మూడు ముక్కలు కావడం చూసి షాకయ్యారు.
వీడియో చూడండి..
ఈ వీడియో ID Creators CRAZE యూజర్ Facebookలో అప్‌లోడ్ చేసింది. దీనిని చాలా మంది షేర్ కూడా చేశారు. బుల్లెట్ బైకర్ లూనాను ఎలా ఢీకొట్టాడు..? బుల్లెట్ అలా ఎందుకు ధ్వంసమైంది అంటూ ప్రశ్నిస్తున్నారు. బుల్లెట్ ధ్వంసం అయిన దాని ప్రకారం.. ప్రమాదం భారీగా జరిగిందా..? ఎవరిదీ తప్పు.. ఇలా ఎందుకు జరిగింది..? అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఒక వినియోగదారు ఈ ప్రమాదంపై వ్యాఖ్యానిస్తూ, లూనాను బలంగా పరిగణించాలా లేదా బుల్లెట్‌గా పరిగణించాలా? అంటూ కామెంట్ చేయగా.. మరొక వినియోగదారు నవ్వుతున్న ఎమోజీని పోస్ట్ చేసారు. ఈ వీడియో పాతదే అయినప్పటికీ.. మళ్లీ నెట్టింట వైరల్ అవుతోంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..
