చైనీస్ నటి జాంగ్ జింగీ బీజింగ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ పై ఓ సాధారణ పాలిథిన్ బ్యాగ్ తో కనిపించి సంచలనం సృష్టించారు. చూడటానికి చెత్త బ్యాగ్ లా ఉన్నా, దాని ధర లక్షా నలభై రెండు వేల రూపాయలు (1790 డాలర్లు). ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చెత్త బ్యాగ్‌గా మారిన ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.