Gas Shortage: తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ కొరత తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వాణిజ్య, గృహ వినియోగదారులు ఇంధనం కోసం ఎదురుచూస్తున్నారు. విజయవాడలోని కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. ఏపీ విజయవాడ హోటల్స్ అసోసియేషన్ సీఎం చంద్రబాబు, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ను కలవాలని నిర్ణయించింది. ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లను నిలిపివేయాలని ఆలోచిస్తోంది.