ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గ్యాస్ కొరత తీవ్రం కావడంతో హోటళ్లు కట్టెల పొయ్యిల వైపు మళ్లుతున్నాయి. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ పట్టణాల్లోని హోటల్ యజమానులు, బాసర ట్రిపుల్ ఐటీ మెస్ నిర్వాహకులు సైతం వంటకు కట్టెలను వినియోగిస్తున్నారు. గ్యాస్ ధరలు పెరగడం, లభ్యత లేకపోవడంతో పాత పద్ధతుల్లో వంటలు చేయక తప్పడం లేదని వాపోతున్నారు.